విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని సొంతం చేసుకున్న హీరో సంతోష్ శోభన్. ఇతని తండ్రి శోభన్ ఇండస్ట్రీ లో పెద్ద డైరెక్టర్. ప్రభాస్ కి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ వర్షం సినిమాకి దర్శకత్వం వహించింది ఆయనే.ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంతోష్ శోభన్, మొదటి సినిమా నుండే తనదైన మార్కు తో ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు.’గోలకంద హై స్కూల్’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన సంతోష్ శోభన్ తొలి సినిమాతోనే మంచి నటుడిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.
కానీ రీసెంట్ గా ఆయన హీరో గా చేసిన సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఈసారి ఆయన ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి తో ‘అన్నీ మంచి శకునములే’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది, మరియు ఆడియన్స్ ని అలరించిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
డాక్టర్ చేసిన చిన్న పొరపాటు వల్ల ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్) బిడ్డ సుధాకర్ కి మరియు సుధాకర్ ( నరేష్ ) బిడ్డ ప్రసాద్ కి ఎక్స్ చేంజ్ అవుతుంది.ఇది ఇలా ఉండగా ప్రసాద్ మరియు సుధాకర్ మధ్య వాళ్ళ తాతలకు సంబంధించిన కాఫీ ఎస్టేట్ ల్యాండ్ కోసం ఒకరిపై ఒకరు మొదటి నుండి గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళ పిల్లలు రిషి (సంతోష్ శోభన్ ) మ్నారియు ఆర్య (మాళవిక మోహన్) ప్రేమించుకుంటారు. వీళ్ళ ప్రేమ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను మర్చిపోయేలా చేసి ఒకటి చేస్తాయా, లేదా ఉన్న గొడవలను పెద్దవి చేస్తాయా?, రిషి మరియు ఆర్య కి తమ అసలు తల్లి తండ్రులు ఎవరో తెలుస్తుందా లేదా?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వెండితెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
నందిని రెడ్డి సినిమా అంటే ప్రేక్షకులు చక్కటి హ్యూమర్ మరియు ఎమోషన్స్ ని ఆశిస్తారు.ఈ చిత్రం లో కూడా ఆమె అదే ట్రై చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తో సరదాగా సాగిపోతుంది, కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా చేస్తుంది.ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా కుదిరాయి. కానీ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం స్లో గా ఉండడం వల్ల ఆడియన్స్ కి కాస్త బోర్ కొడుతుంది. సినిమా మొత్తం అదే రేంజ్ లో తీసి ఉంటే ఈ సమ్మర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.కానీ చివరికి యావరేజి గా మాత్రమే నిలిచింది. సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించింది.
ఇక సంతోష్ శోభన్ విషయానికి వస్తే తన ప్రతీ సినిమాలో చేసినట్టుగానే ఈ సినిమాలో కూడా చేసాడు.కానీ ఈ చిత్రం లో నందిని రెడ్డి ఆయన యాక్టింగ్ ని సరికొత్త కోణం లో చూపించే ప్రయత్నం చేసింది. ముందు సినిమాలతో పోలిస్తే నటన పరంగా సంతోష్ శోభన్ ఈ సినిమాతో రాటుదేలాడు అని చెప్పొచ్చు. ఇక మాళవిక నాయర్ కూడా ఈ చిత్రం లో చాలా చక్కగా నటించింది.ఇక ఈ సినిమాకి ఆయువు పట్టులాగా నిల్చిన వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ మరియు నరేష్.
వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ కొన్ని సన్నివేశాలలో పేలింది. కానీ మిక్కీ జె మేయర్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆడియన్స్ సహనాన్ని పరీక్షించినట్టు అయ్యింది.ఆయన సరిగా డ్యూటీ చేసి ఉంటే ఈ సినిమా ఈ సమ్మర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇక నిర్మాత స్వప్న దత్ క్వాలిటీ ప్రొడక్షన్ విలువలను కాపాడుతూ ఎక్కడ కూడా క్వాలిటీ మిస్ కాకుండా తెరకెక్కించింది ఈ చిత్రాన్ని.
చివరి మాట :
థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి కాసేపు టైం పాస్ అయ్యే విధంగా ఉండే సినిమా. కొన్ని కామెడీ సన్నివేశాల కోసం ఒకసారి చూడొచ్చు.
నటీనటులు : సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్ , నరేష్ , వెన్నెల కిషోర్, రావు రమేష్ , గౌతమీ తదితరులు.
దర్శకత్వం : నందిని రెడ్డి
సంగీతం : మిక్కీ జె మేయర్
నిర్మాత : ప్రియాంక దత్
రేటింగ్ : 2.5/5