సినిమా ఇండస్ట్రీ లో నేడు భోగభాగ్యాలు అనుభవిస్తున్న ఎంతో మంది స్టార్ హీరోలు మరియు హీరోయిన్లకు వాళ్లకు ఇంత అందమైన జీవితం ఊరికే రాలేదు. ఈ జీవితాన్ని పొందేందుకు వాళ్ళు ఎదురుకున్న కష్టాలు , పడిన బాధలు వింటే కనీళ్ళు ఆపుకోలేము. ఎన్నో సవాళ్ళను ఎదురుకొని నేడు వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు.అలా జీవితం లో ఎన్నో కష్టాలను అనుభవించి వచ్చిన హీరోలలో ఒకడు విజయ్ ఆంటోనీ.
తమిళ నాడు స్టైలిష్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న ఈ క్రేజీ హీరో, మన తెలుగు ఆడియన్స్ కి బిచ్చగాడు అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఆయనకీ తెలుగు లో కూడా మంచి మార్కెట్ ఎపడింది.ఇక రేపు ఆయన హీరో గా నటించిన ‘బిచ్చగాడు 2 ‘ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళ బాషలలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆయన తెలుగు వెర్షన్ కి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ తెగ ఇచ్చేస్తున్నాడు.రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ,తన జీవితం లో ఎదురుకున్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు, ఆయన మాట్లాడుతూ ‘మా సొంత ఊరు తమిళనాడు లోని నగర్ కోయిన్, మా నాన్న గారు ప్రభుత్వ ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేసేవాడు.నాకు 7 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. ఆ చనిపోవడం తో మా కుటుంబం మొత్తం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకుంది.
సొంత ఇల్లు కూడా లేని మేము కొంతకాలం బంధువుల ఇళ్లల్లో ఉండేవాళ్ళం, ఆ తర్వాత కొన్నాళ్ళకు నాన్న ఉద్యోగం అమ్మకి వచ్చింది. తిరునల్వేలి అనే ఊరులో మా అమ్మకి అద్దె ఇల్లు ఎవ్వరు ఇవ్వలేదు, ఆ సమయం లో నేను హాస్టల్ లో ఉండేవాడిని . అమ్మ ఎక్కడ ఉందో తెలియదు, సరిగ్గా ఆ సమయం లోనే నాకు వేసవి సెలవలు ప్రకటించారు. అమ్మని ఎలా కలవాలో తెలియక శ్రీలంక శరణార్థ విద్యార్థులతో కలిసి బస చేశాను, ఆ సమయం లో నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అరటి పళ్ళు తిని పొట్టని నింపుకునేవాడిని’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ ఆంటోనీ.