మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి అందరికి తెలుసు.. సినిమాల్లో లేకపోయిన కూడా సెలెబ్రేటీల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది.. ఉపాసన సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు.. ఏ పోస్ట్ పెట్టినా కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది… ఇకపోతే ఈమె గర్భవతి అన్న విషయం తెలిసిందే.. అయితే ఆమె ప్రగ్నెన్సీ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఉపాసనకు బుల్లి మెగా పవర్ స్టార్ పుట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. జులై నెలలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్టు వెల్లడించారు..
ఇకపోతే ఉపాసన కొన్నిరోజుల క్రితం తల్లి కావాలని నేను తీసుకున్న నిర్ణయం వారసత్వాన్ని కొనసాగించాలని లేదా వివాహ బంధాన్ని బలోపేతం చేయాలని తీసుకున్న నిర్ణయం కాదని ఆమె అన్నారు.. నాబిడ్డకు ప్రేమను అందించాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఉపాసన తెలిపారు.. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె తన ప్రగ్నెన్సీ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది..పెళ్లికి ముందే చరణ్ తో మంచి స్నేహం ఉందని తనతో ఉన్న స్నేహం వల్ల పిల్లలను ఎప్పుడు కనాలనే విషయానికి సంబంధించి స్పష్టత ఉందని ఉపాసన వెల్లడించారు..
ఇక పెళ్లికి ముందే నా ఎగ్స్ ను నిల్వ ఉంచాలని నిర్ణయించినట్లు ఉపాసన పేర్కొంది..ఆ టైమ్ లో కెరీర్ పై దృష్టి పెట్టాలని మేము భావించడం జరిగిందని ఉపాసన పేర్కొన్నారు. జీవితంలో సరైన సంపాదన తర్వాత మాత్రమే పిల్లలకు స్వాగతం చెప్పాలని భావించామని ప్రస్తుతం నేను, చరణ్ స్థిరమైన స్థానాలలో ఉన్నామని ఉపాసన చెప్పుకొచ్చారు.. ఈరోజు మా సంపాదనతో పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తామనే నమ్మకం ఉందని ఆమె అన్నారు. పెళ్లి ప్రారంభంలోనే తన ఎగ్స్ ను ఫ్రీజ్ చేసినట్టు ఉపాసన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఉపాసన చరణ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చే క్షణం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు..