ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాల్లో క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఆయన ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిల్లో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం #OG.ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

రీసెంట్ గానే ముంబై మరియు పూణే ప్రాంతం లో ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా హీరోయిన్ ప్రియాంకా మోహన్, ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒక అందమైన పాటని కూడా పవన్ కళ్యాణ్ – ప్రియాంక మోహన్ పై తెరకెక్కించారు. లేటెస్ట్ షెడ్యూల్ రేపటి నుండి హైదరాబాద్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ లో అభిమానులకు పూనకాలు రప్పిస్తున్నాయి.అదేమిటంటే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో జరిగిపోతుందని,కాబట్టి నిర్మాత దానయ్య ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తుంది.

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి అవ్వగానే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గ్లిమ్స్ వీడియో ద్వారా తెలియచేస్తారని తెలుస్తుంది.ఈమధ్య కాలం లో డిసెంబర్ లో విడుదల అయ్యే సినిమాలకు అద్భుతమైన రన్ ఉంటున్నాయి. ధమాకా , అఖండ మరియు పుష్ప సినిమాలు టాలీవుడ్ లో అద్భుతమైన వసూళ్లను రాబట్టాయి. ఇక #OG కి మామూలు టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ విద్వంసం ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.