Shrihan : సిరి చేస్తే తప్పులేదు.. శ్రీహాన్ చేస్తే తప్పా.. ఛీ.. ఛీ.. వీడియో వైరల్..

- Advertisement -

Shrihan : బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత చాలా జంటలు విడి పోతున్నారు.. గతంలో షన్ను, దీప్తి బ్రేకప్ చెప్పి ఎవరి లైఫ్ వారిది అన్నట్లు బ్రతుకుతున్నారు. ఇప్పుడు మరో జంట విడి పోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇక ఈవారం గడిస్తే గ్రాండ్ గా ఫినాలే లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక ఇందులో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చాలామందిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శ్రీహన్ Shrihan కి సిరి బ్రేకప్ చెప్పినట్లుగా ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరి సిరి శ్రీహాన్ బ్రేకప్ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విషయంలోకి వెళ్తే.. ఈ సీజన్లో 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ చాలా తక్కువ టిఆర్పి రేటింగ్ ని నమోదు చేసుకుంది.ఇక వారం వారం గడుస్తున్న కొద్ది కొద్ది కొద్దిగా రేటింగ్ పెరుగుతూ బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారా అని చాలామంది ఆలోచనలో పడ్డారు. ఇక ఈ సీజన్లో సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన శ్రీహన్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.

SIri Hanumanth About Shrihan
SIri Hanumanth About Shirhan

గత సీజన్లో ఈయన లవర్ సిరి కూడా బిగ్ బాస్ కి వచ్చింది. ప్రస్తుతం శ్రీహాన్ కి సిరి బయట ఉండి చాలా సపోర్ట్ చేస్తుంది. అయితే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరి నిర్వహించే బిబి కేఫ్ లో గెస్ట్ గా పాల్గొంది సిరి హనుమంతు. ఇక ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన తాజా ప్రోమో ఒకటి బయటికి రావడంతో అది కాస్త చాలా వైరల్ అవుతుంది.అరియానా ఒక యూట్యూబ్ ఛానల్ వారి థంబ్ నెయిల్ సిరికి చూపించి మీ పెళ్లి ఎప్పుడు జరిగింది అంటూ ప్రశ్నించింది.దీనికి సిరి మాట్లాడుతూ.. మా మ్యారేజ్ నిజంగానే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా జరుగుతుంది అని క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

అలాగే మరొక యూట్యూబ్ ఛానల్ వారు పెట్టిన ఒక వీడియోని చూపిస్తూ పెళ్లి కాకుండానే నువ్వు తల్లివి ఎలా అయ్యావు. నువ్వు తళ్ళైనట్టు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు థంబ్ నెయిల్స్ సృష్టించారు అని అడిగింది. దీనికి సిరి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏంటి నేను తల్లిని ఎప్పుడు అయ్యాను అంటూ తన కడుపు వైపు చూసుకొని అలాంటిది ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది.

మరొక యూట్యూబ్లో క్రియేట్ చేసిన థంబ్ నెయిల్ చూపిస్తూ సిరి జ్ఞాపకాలు అన్ని లైఫ్ లో నుండి తీసేసిన శ్రీహాన్ ఇది నిజమేనా అని అడిగింది. దానికి సిరి హనుమంతుచాలా ఎమోషనల్ అయింది. అలాంటివి ఏమీ లేవు. మా వ్యక్తిగత జీవితంలో ఎన్నో గొడవలు జరిగాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం గురించి ఇంకా ఏం చెప్పింది అనేది పూర్తి ఇంటర్వ్యూ చూస్తే గనుక మనకు తెలియదు. ఇక ఈ సస్పెన్స్ వల్ల ఆ ఎపిసోడ్లో సిరి ఇంకా ఏం మాట్లాడింది అనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి పెరిగింది. ఇక సిరి మాట్లాడిన మాటలు తెలియాలంటే ఆ ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే మరి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here