బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ (Vijay Varma).. నేచురల్ స్టార్ నాని MCA సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఇక ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) వలన సౌత్ లో ఈ నటుడు పేరు గట్టిగా వినిపిస్తుంది. ముంబై వీధుల్లో వీరిద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుండడంతో బి-టౌన్ లో హాట్ టాపిక్ అయ్యిపోయారు. అయితే వీరిద్దరి రిలేషన్ ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బయట పడింది. విజయ్, తమన్నా ముద్దు పెట్టుకుంటున్న ఒక వీడియో బయటకి రావడంతో వీరిద్దరి ప్రేమ భాగవతం బయటకి వచ్చింది.
విజయ్ వర్మ నటించిన తాజా వెబ్ సిరీస్ ‘దహాద్’ (Dahaad). సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ మే 12న విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది. ఇక ఈ సిరీస్ ప్రచారంలో భాగంగా పేపర్లో ప్రకటన ఇచ్చారు. అందులో ఇండియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు వధువు కావలెను అని ఉంది. ఈ ఫొటోను విజయ్ వర్మ షేర్ చేశాడు. ‘ఈ విషయాన్ని మా అమ్మకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి’ అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో నెటిజన్లంతా ‘తమన్నా ఉందిగా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో తమన్నాను ట్యాగ్ చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్‌కు సినీతారలు సైతం స్పందిస్తుండడం విశేషం. ఒకరు చాలదా నాయనా అంటున్నారు.
ఒకసారి మీడియా కంట పడినప్పటి నుంచి వీరిద్దరూ కూడా ఎక్కడ కనిపించినా జంటగానే దర్శనమిస్తున్నారు. దీంతో తమన్నా, విజయ్ క్లారిటీ ఇవ్వకపోయినా వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అందరు ఫిక్స్ అయ్యిపోయారు. అయితే సడన్ గా విజయ్.. తనకి ‘వధువు కావలెను’ అంటూ ఇచ్చిన పేపర్ యాడ్ అందర్నీ షాక్ కి గురి చేసింది. నిన్న (మే 14) మదర్స్ డే సందర్భంగా విజయ్ తన తల్లికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో విజయ్ వర్మ తల్లి పేపర్ లో వచ్చిన యాడ్ చూసి తల పట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది.