కన్నడ చిత్ర పరిశ్రమలో పార్టీ కిర్రిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రష్మిక మందన నటించిన ఈ సినిమా, కన్నడలో హిట్ కొట్టడంతో అవకాశాలు పెరిగి, తెలుగు, తమిళ, హిందీ భాషలలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. టాలీవుడ్లో చలో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఆ తర్వాత తీసిన గీత గోవిందం సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ రేంజ్ ని పొందింది. క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి, ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ లెవెల్‌కు ఎదిగింది. టాలీవుడ్లో పెద్ద స్థాయికి ఎదిగిన రష్మిక, మాతృభాష కన్నడ గురించి, కన్నడ సినిమాల గురించి తను మాట్లాడిన మాటలు ఎంతగానో వైరల్ అయ్యాయి.
అంతకుముందు తను ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ, అందులో భాగంగా తను చెప్పిన మాటల వల్ల ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకొనుంది. అదేమిటంటే తనకు చాలా భాషలలో మాట్లాడడానికి ఎంతో సులువుగా ఉంటుంది. అయితే తన మాతృభాష అయినా కన్నడలో మాట్లాడడం కష్టంగా ఉంటుందని చెప్పింది.ఇక అప్పటి నుండి తను ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని, అనేక ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. అయితే అప్పట్లో తను మాట్లాడిన మాటల వల్ల రష్మికపై తీవ్రంగా విమర్శలు తలెత్తాయి. అంతేకాకుండా కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషనల్ హిట్ అయిన కాంతారా సినిమా గురించి, రష్మిక మాట్లాడిన మాటలు ఎంత దుమారం లేపాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కాంతార సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తూ, ముందుకు దూసుకెళుతుండగా ఎంతోమంది ప్రముఖులు, సీనియర్ రాజకీయ నాయకులు సినిమా గురించి ఎన్నో ప్రశంసలను కురిపించారు. అంతటి హిట్ సినిమా గురించి రష్మిక అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాంతారావు సినిమా మీద తనకున్న అభిప్రాయాన్ని బయటకు చెప్పకపోగా, ఆ సినిమా చూసేంత టైం తనకు లేదని కామెంట్స్ చేసింది.
దీనివల్ల రిషబ్ శెట్టి, రష్మికల మధ్య చిన్న వార్ జరిగిందనే చెప్పవచ్చు. రిషబ్ కూడా తనదైన స్టైల్ లో తనకు బుద్ధి చెప్పాడు. అయినా కన్నడ సినిమా పరిశ్రమ అంతటితో ఆగలేదు. మాతృభాషా కన్నడ గురించి, కన్నడ ఇండస్ట్రీ గురించి తను మాట్లాడిన పద్ధతిని చూసి, తనకు పెద్ద షాక్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని వార్తలు వినబడుతున్నాయి.