బేబీ బంప్ తో నెట్టింట ఇలియానా రచ్చ.. తండ్రెవరంటూ చెప్పమంటూ నెటిజన్ల రిక్వెస్ట్

- Advertisement -

ఇలియానా డీక్రూజ్.. ఇటీవల ఈ గోవా బ్యూటీ సోషల్ మీడియాలో ఓ బాంబ్ పేల్చింది. సడెన్ గా ఓ రోజు బేబీ టీ షర్ట్.. మమా లాకెట్ ఫొటోలు పెట్టి తను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అది చూసి షాకైన ఫ్యాన్స్.. అదేంటి ఇల్లూ బేబీకి పెళ్లయిందా.. అప్పుడే తల్లి కూడా కాబోతోందా అని తికమకపడ్డారు. పెళ్లి కాలేదని తెలిసి మరింత షాక్ అయ్యారు. పెళ్లి కాకుండానే తల్లి అవుతోందా.. ఇంతకీ తండ్రెవరంటూ తెగ తలలు పట్టుకున్నారు. కొందరేమో ఇదంతా ట్రాష్.. తను ప్రెగ్నెంట్ కాదని ఫిక్స్ అయ్యారు.

ఇలియానా
ఇలియానా

అయితే వారి అంచనాలు పటాపంచలు చేస్తూ ఇటీవలే తన బేబీ బంప్ చూపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. కడుపులో బిడ్డ తన్నుతున్నాడంటూ పోస్టు పెట్టింది. ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్ నిజంగానే ఇల్లూ బేబీ తల్లి కాబోతోందని ఫిక్స్ అయ్యారు. కానీ తండ్రి ఎవరంటూ నెట్టింట తెగ సర్చ్ చేయడం ప్రారంభించారు. కానీ ఎవరో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు. ఎప్పుడు ఆ బిడ్డ తండ్రిని ఇలియానా పరిచయం చేస్తుందా అని తెగ ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ పీరియడ్ ను ఎంజాయ్ చేస్తున్న ఇలియానా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన హెల్త్ అప్డేట్స్, క్రేవింగ్స్ గురించి పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ఫొటోషూట్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్సులో బేపీ బంప్ ను ఎక్స్ పోజ్ చేస్తూ పోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు భలే సంబుర పడిపోతున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ తన లైఫ్ లో చాలా విలువైన దశను ఎంజాయ్ చేస్తోందని సంతోష పడుతున్నారు. 

- Advertisement -

మరికొంత మందేమో ఈ ఫొటోలను చూసి తండ్రెవరో చెప్పకుండా ఈ ఫొటోలు పెట్టడం ఏంటని విసుక్కుంటున్నారు. తండ్రెవరో తెలియక తలలు పట్టుకుంటున్నామని.. ఇంకెన్నాళ్లు ఈ సస్పెన్స్ అంటూ తెగ బాధపడిపోతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత ఈ సీక్రెట్ రివీల్ చేస్తుందేమో అని కొందరు నెటిజన్లు భావిస్తుంటే.. లేదు లేదు.. బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక అప్పుడు పరిచయం చేస్తుందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. 

ఇలియానా లవ్ స్టోరీస్ కు లెక్కలేదు. అప్పట్లో ఈ భామ ఓ ఫారిన్ ఫొటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. వాళ్లిద్దరు కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను నెట్టింట పోస్టు చేసింది. కొంతకాలం తర్వాత ఆ ఫొటోలను నెట్టింటి నుంచి డిలీట్ చేయడంతో ఇద్దరు విడిపోయారని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు.

ఆ తర్వాత ఈ భామ బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ బర్త్ డే వెకేషన్ లో కనిపించింది. కత్రినా సోదరుడితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడం.. తరచూ ముంబయి వీధుల్లో ఈ ఇద్దరు కలిసి కనిపించడంతో  ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు బీ టౌన్ కోడై కూసింది. ఇక ఇప్పుడు ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడంతో ఈ బ్యూటీకి పుట్టబోయే బిడ్డకు కత్రినా బ్రదరే తండ్రి అయి ఉంటాడని అందరూ భావిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here