తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్స్‌గా వెలుగొందిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఝాన్సీ ఒకరు. హింట్ ఇస్తే చాలు అల్లుకుపోయి మరీ యాంకరింగ్ చేస్తుంది. చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేస్తూ మొదలె పెట్టిన కెరీర్‌ని ఆమె ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను దాటుకుంటూ ముందుకెళ్లి స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఆపై వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుని మంచి నటిగా కూడా ఝాన్సీ గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ఝాన్సీ తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇప్పటి వరకూ 45 సినిమాల్లో నటించినప్పటికీ ఎందుకో ఝాన్సీ వెండితెరపై కూడా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. ఝాన్సీ కెరీర్ అంతా సవ్యంగా సాగలేదు. ఇక రియల్ లైఫ్‌లోనూ కొన్ని చేదు సంఘటనలు ఉన్నాయని ఝాన్సీ తెలిపింది. కొత్తలో అంతా తనకు పొగరు ఉండేదని అనుకునే వారని.. కానీ అందులో వాస్తవం లేదన్నారు. అసలు తానేంటనేది తనతో పని చేసిన వారికి తెలుసన్నారు.
నన్ను బాధపెట్టిన వాళ్లకి నా శాపం చాలా గట్టిగా తగులుతుంది.. ఊరికే పోదు. చాలామందికి నా శాపం తగిలే ఉంటుంది.. అది తగిలి వాళ్లు చెప్పాలి. నాతో ఓ సినిమాకి రెండు రోజులు క్యారెక్టర్ చేయించుకుని సడెన్‌గా నన్ను సినిమా నుంచి తీసేసిన వాళ్లకి తెలియాలి నా శాపం గురించి. ఓ పెద్ద డైరెక్టర్.. ఓ పెద్ద హీరో.. రెండు రోజులు షూటింగ్ చేయించుకున్నారు.. నా రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేశారు కానీ.. చెప్పా పెట్టకుండా నన్ను రీప్లేస్ చేసి.. వేరే వ్యక్తితో ఆ క్యారెక్టర్ చేయించుకుంటే అది నాకు అవమానమే కదా. అందుకే నా శాపం వాళ్లకి బాగా తగిలింది. వాళ్లకి మామూలు దెబ్బ తగల్లేదు. కోలుకోలేనంత దెబ్బ తగిలింది.. తిరిగి ఇప్పటివరకూ మళ్లీ లేవలేదు. అది నా వల్లే అని అనడం లేదు.. వాళ్ల సినిమాలో దమ్ములేదు కాబట్టి తగిలిన దెబ్బకి మళ్లీ లేవలేకపోయారు.