చాలామందితో పడుకున్నాను.. అందరిలో తెలిపిన స్టార్ హీరోయిన్

- Advertisement -

ప్రియాంకా చోప్రా తన తదుపరి హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ‘లవ్‌ అగైన్‌’ (Love Again) ప్రమోషన్స్‌లో భాగంగా ఆంగ్ల పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra). తాజాగా ఈ భామ ఇటీవల తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి వెల్లడించారు. అలాగే, తనకు ఆనందాన్ని ఇచ్చిన ఓ విషయం గురించి కూడా పంచుకున్నారు. ‘‘లవ్‌ అగైన్‌’ ప్రీమియర్‌ ఇటీవల న్యూయార్క్‌లో గ్రాండ్‌ లెవల్‌లో జరిగింది. ప్రెస్‌వాళ్లు పెద్దసంఖ్యలో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. నేను రెడ్‌కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు ఓ వైపు ఫొటోగ్రాఫర్స్‌, మరోవైపు ఫ్యాన్స్‌ ఫొటోలు తీస్తున్నారు. నేను వేసుకున్న హై హీల్స్‌ వల్ల ప్రమాదవశాత్తు కాలుజారి కార్పెట్‌పై పడిపోయాను. ఆ క్షణం నాకెంతో ఇబ్బందిగా అనిపించింది.

ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా

ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్‌’ (Citadel) వెబ్‌సిరీస్‌ ప్రొమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక.. గతంలో తన రిలేషన్‌షిప్స్‌ గురించి నోరువిప్పింది. తన మాజీ బాయ్‌ ఫ్రెండ్స్‌ (ex boyfriends) అంతా చాలా మంచివారని, ఎంతో గొప్పవారని తెలిపింది. నేను గతంలో చాలా మందితో డేటింగ్‌ (Relationships) చేశా. ఒక బంధం నుంచి మరో బంధానికి మారుతూ వచ్చాను. బంధానికి, బంధానికి మధ్య ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. నా సహచర నటులతో, సెట్‌లో నాతో కలిసి పనిచేసిన కొందరితో డేటింగ్ చేసేదాన్ని. రిలేషన్ షిప్ ఎలా ఉండాలనే దానిపై నాకు ఒక ఆలోచన ఉందనుకున్నాను. దాంతో నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులు నాకు తగినట్టుగానే ఉన్నారా? అనేది తెలుసుకోవాలని అనుకున్నాను.

అయితే, నిక్‌ తన జీవితంలోకి రావడానికి ముందు రెండేళ్లు ఎలాంటి రిలేషన్‌ షిప్‌లోనూ లేనని వెల్లడించింది. ‘నా భర్త (నిక్‌ జొనాస్‌) కంటే ముందు దాదాపు రెండేళ్ల వరకు విరామం తీసుకున్నాను. అప్పుడు ఎలాంటి రిలేషన్‌లో లేను. అందుకు ఓ పెద్ద కారణం ఉంది’ అని ప్రియాంక స్పష్టం చేసింది. కాగా, ప్రియాంక హాలీవుడ్‌కు వెళ్లకముందు బాలీవుడ్‌ నటులతో డేటింగ్‌లో ఉందంటూ అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. షాహిద్‌ కపూర్‌, హర్మన్‌ బవేజా, షారుక్‌ ఖాన్‌ వంటి స్టార్‌ నటులతో ప్రియాంక ప్రేమాయణం సాగించిందని బీటౌన్‌ మొత్తం కోడై కూసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here