శ్రీముఖి అంటే కొత్తగా పరిచయం అక్కర్లేదు. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ ఈ బుల్లి తెర రాములమ్మను ఇట్టే గుర్తుపట్టేస్తారు. పైగా బిగ్ బాస్ పుణ్యమా అని మరింత క్రేజ్ తెచ్చుకుంది కూడా. ఈ షో తర్వాత మరోసారి కెరీర్‌పై ఫోకస్ చేసింది. రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తుంది. ఈ అమ్మడు 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీలో లీడ్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ‘అదుర్స్’ టీవీ రియాలిటీ షో , సూపర్ సింగర్ 9 ప్రోగ్రామ్స్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన ‘పటాస్’ షో శ్రీముఖికి మాస్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. టీవీ, సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3లో పాల్గొంది. అంతేకాదు ఈ షోలో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్టించారు. అయితే ఇంత యాక్టివ్ గా ఉండే శ్రీముఖి సినిమా కెరీర్ నాశనం అవ్వడానిక ఒక ప్రముఖ దర్శకుడు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీముఖి త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో స్టార్ హీరోకు చెల్లెలిగా అవకాశం ఇచ్చే సరికి మరెవ్వరూ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వలేదు. అంతే కాదు త్రివిక్రమ్ ఒక రోజు శ్రీముఖి (Srimukhi) కి ఫోన్ చేసి నువ్వు అలా బుల్లితెరపై రాణిస్తే నీకు వెండితెరపై అవకాశాలు తగ్గిపోతాయి.. నువ్వు పూర్తిగా వెండితెర మీద ఉంటే హీరోయిన్గా అవకాశాలు వస్తాయి అని చెప్పడంతో ఆయన మాటలు నమ్మి శ్రీముఖి (Srimukhi) కొన్ని రోజులు బుల్లితెరకి గుడ్ బై చెప్పిందట. వెండితెరపై అవకాశాల కోసం ఎదురు చూసింది.