సమ్మర్ లో విడుదలైన సినిమాలలో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.కొత్త సినిమాలు ఎన్ని పుట్టుకొస్తున్నా కూడా ఈ చిత్రం ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద డామినేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది.ఈమధ్య కంటెంట్ బాగున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో కలెక్షన్స్ దుమ్ములేపేస్తున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా బాలీవుడ్ లో ఒక సినిమా జనాల్లోకి వెళ్ళింది అంటే కనీసం 50 రోజులు లాంగ్ రన్ ఇస్తారు, పుష్ప , కార్తికేయ 2 మరియు కాంతారా వంటి చిత్రాలు అలాగే ఆడాయి.’విరూపాక్ష’ చిత్రం కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతుంది అనే గట్టి నమ్మకం తో, ఈ చిత్రాన్ని హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో దబ్ చేసి రీసెంట్ గానే విడుదల చేసారు.
అందుకోసం ప్రొమోషన్స్ కూడా చాలా బలంగానే చేసారు కానీ, కలెక్షన్స్ మాత్రం నిల్.దీనితో కన్నడ లో దబ్ చేసే ఆలోచనని విరమించుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రాన్ని హిందీ,మలయాళం మరియు తమిళ బాషలలో దబ్ చేసి, ప్రొమోషన్స్ చేసి విడుదల చెయ్యడానికి నిర్మాతకు అయిన ఖర్చు 2 నుండి 3 కోట్ల రూపాయిలు.
ఇప్పటి వరకు ఈ బాషలన్నిటికీ కలిపి వచ్చిన వసూళ్లు కేవలం 50 లక్షల రూపాయిలు మాత్రమే, ఫుల్ రన్ లో మూడు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తుందా అంటే అనుమానమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.కేవలం కంటెంట్ బాగుంటే సరిపోదు, సరైన టైమింగ్ మరియు అదృష్టం కూడా కలిసి రావాలి , అప్పుడే ఇతర బాషలలో కూడా సినిమాలు సక్సెస్ అవుతాయి అని చెప్పడానికి ఉదాహరణగా విరూపాక్ష చిత్రాన్ని తీసుకోవచ్చు, మేకర్స్ ఇక నుండి ఇది దృష్టిలో పెట్టుకోవాలి అని అంటున్నారు విశ్లేషకులు.