తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉండొచ్చు, కానీ ‘విజయ శాంతి’ రూటే సపరేటు.14 ఏళ్ళ వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విజయశాంతి, అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోల సరసన తెలుగు మరియు తమిళం బాషలలో సూపర్ హిట్ సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా ఎదిగింది.
కేవలం హీరోల రాజ్యం ఇండస్ట్రీస్ లో కొనసాగుతున్న రోజుల్లో , ఒక హీరోయిన్ హీరోలతో సమానంగా డైలాగ్స్ చెప్పడం, వాళ్ళతో సమానంగా ఫైట్స్ మరియు డ్యాన్స్ చెయ్యడం బహుశా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో విజయశాంతితోనే మొదలైంది.అప్పట్లో ఆమెని హీరో స్థానం లో పెట్టి ఎన్నో సంచలనాత్మక సినిమాలు తీశారు దర్శక నిర్మాతలు. అప్పట్లో విజయ్ శాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద చిరంజీవి , బాలకృష్ణ మరియు రజినీకాంత్ వంటి సూపర్ స్టార్స్ తో పోటీ పడేవి, అందుకే ఆమెని అప్పట్లో లేడీ అమితాబ్ అని పిలిచేవాళ్ళు.
అయితే ఆమెకి హీరోలతో సమానంగా సూపర్ స్టార్ ఇమేజి రావడం వల్ల ఇబ్బందులు కూడా చాలా ఎదురయ్యాయి అట.కొంతకాలం క్రితం ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.ఆమె మాట్లాడుతూ ‘ఆరోజుల్లో నన్ను పెట్టి హీరో ఓరియెంటెడ్ మూవీస్ చేసేవాళ్ళు.అవి ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి.సౌత్ లోనే సూపర్ స్టార్ ఇమేజి రావడం తో హీరోలకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాను, 1991 వ సంవత్సరం లోనే నేను కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాను.
అప్పట్లో హీరోలకు కూడా అంత ఇచ్చేవాళ్ళు కాదు, ఒక అమ్మాయి తమతో సమానంగా ఫైట్స్ చెయ్యడం ఏమిటి, తమతో సమానంగా స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం ఏమిటి అని చాలా మంది హీరోలలో నాపై అసూయ ఉండేది. నా సినిమా విడుదల సమయం వాళ్ళు నాకు వెన్నుపోటు పొడిచారు, వాళ్లకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఫైనాన్షియర్స్ దగ్గర నుండి నా సినిమాలకు ఎన్నో ఇబ్బందులు సృష్టించారు, ఆ హీరోలు గతం లో నాతో కలిసి పనిచేసారు కూడా’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ విజయశాంతి ని అంతలా ఇబ్బంది పెట్టిన ఆ స్టార్ హీరోలు ఎవరు అని నెటిజెన్స్ ఆరాలు తీస్తున్నారు.