మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో డిజాస్టర్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘శంకర్ దాదా జిందాబాద్’.ఈ సినిమాలోని పాటలన్నీ అప్పట్లో ఒక ఊపు ఊపేసాయి.దానికి తోడు ‘శంకర్ దాదా MBBS’ కి సీక్వెల్ అనడం తో ఈ పై విడుదలకు ముందు జనాల్లో ఉన్న క్రేజ్ వేరు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి ఓపెనింగ్స్ అయితే బాగా వచ్చాయి కానీ, ఫుల్ రన్ లో మాత్రం కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది.

ఫలితంగా మెగాస్టార్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ గా నిల్చింది. ఈ చిత్రం లో రవితేజ , అల్లు అర్జున్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధులుగా నటించారు. అయితే ఈ సినిమాలో సూపర్ హిట్ గా నిల్చిన సాంగ్స్ లో ఒకటి ‘ఆకలేస్తే అన్నం పెడుతా’. ఈ ఐటెం సాంగ్ ని ఇప్పటికీ పార్టీలలో మరియు పబ్బులలో ఉపయోగిస్తూనే ఉంటారు.

ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి స్టెప్పులేసిన హాట్ బ్యూటీ ‘యానా గుప్త’ ని మన కుర్రాళ్ళు అంత తేలికగా మర్చిపోగలరా.హాట్ అందాలతో మతెక్కించే రేంజ్ లో డ్యాన్స్ చేస్తూ కుర్రాళ్లను వెర్రెత్తిపోయ్యేలా చేసింది ఈ బ్యూటీ.స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఉన్న ఈమె , ఇప్పటి వరకు 14 సినిమాలు చేస్తే అందులో పది సినిమాల్లోనూ ఆమె ఐటెం సాంగ్స్ కి మాత్రమే పరిమితం చేసారు దర్శక నిర్మాతలు.16 ఏళ్ళ వయస్సులోనే మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టిన యానా గుప్త, ఆ తర్వాత జపాన్ కి వెళ్లి అక్కడ కొన్నాళ్ళు మోడలింగ్ రంగం లో పని చేసింది.

ఆ తర్వాత ఇండియా కి వచ్చిన ఈమె, బాలీవుడ్ పాపులర్ ఆర్టిస్ట్ సత్యకం గుప్త అనే అతనిని 2001 వ సంవత్సరం లో పెళ్లాడింది. అతని వల్లే ఈమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే వీళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని అభిప్రాయం విబేధాల కారణం గా 2005 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు , ఈమె టెలివిజన్ లో కూడా ఎన్నో షోస్ లో పాల్గొన్నది.
ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ లో ఒకటిగా నిల్చిన బిగ్ బాస్ సీజన్ 6 హిందీ లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నది. 2018 వ సంవత్సరం వరకు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ వచ్చిన యానా గుప్త, ఆ తర్వాత సినిమాలకు దూరమై మోడలింగ్ రంగం లోనే కొనసాగుతుంది. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

