సంయుక్త మీనన్ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఎంత గొప్పగా తీస్తారనే పేరు ఉందో.. హీరోయిన్లతో ఎఫైర్ల విషయంలోనూ గురూజీ పేరు గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఎప్పుడూ ఒకే హీరోయిన్ అన్నట్టుగా కాకుండా మారుతూ ఉంటుంది. అందులో పెద్ద పెద్ద హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయి కానీ.. ఇప్పుడు వాళ్ల పేర్లు ప్రస్తావించడం అప్రస్తుతం కనుక.. ప్రస్తుతం అయితే రెండు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకటి పూజా హెగ్డే.. రెండు సంయుక్త మీనన్.

విరూపాక్ష సినిమాతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను తనవైపుకు తిప్పుకుంది సంయుక్త. ఇందులో కనిపించిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్.. అంతకు ముందు భీమ్లా నాయక్లోనూ, సార్ లోనూ నటించింది. బింబిసారలోనూ ఈమెనే నటించింది. ఈ మూడు సినిమాలు హిట్ అయ్యాయి. అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే.. అటు భీమ్లానాయక్ సినిమాకి దర్శకుడు సాగరైనా.. అంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతులపైనే నడిచింది. స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించారు. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది సంయుక్త మీనన్ (Samyuktha Menon). పవన్ చెల్లెలుగా.. రానాకి భార్యగా నటించి మెప్పించింది ఈమెనే.

ఇప్పుడు ‘సార్’లోనూ సంయుక్త మీనన్ని మెయిన్ హీరోయిన్ని చేసేశారు త్రివిక్రమ్. ఈ సినిమాకు త్రివిక్రమ్ కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా. ఈ సినిమాకు సహ నిర్మాత త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య (Sai Soujanya) అంతేకాదు గురూజీకి మదర్ బ్యానర్ లాంటి సితార ఎంటర్ టైన్మెంట్స్లోనే ఈ సినిమా విడుదలైంది.ఇక విరూపాక్ష టైంలో అయితే ఏకంగా పబ్లిక్ గానే సంయుక్తతో కలిసి కనిపించారు. అంతేకాదు ఆమె చేతుల్లో చేతులు వేసి మరీ ముచ్చటించారు. దీంతో త్రివిక్రమ్ సంయుక్తని కూడా వదలడం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.