నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal ) చేసింది కొన్ని సినిమాలే.. కానీ మాటలు మాత్రం పచ్చిగా ఉన్నాయి.. ఆమెకు డబ్బులు ఇవ్వక పోయిన పర్లేదు కానీ, ఆ హీరోతో ఆ ఛాన్స్ ఇస్తే చాలు అంటుంది ముద్దుగుమ్మ.. ఆ ఒక్క మాట దుమారం రేపుతుంది.. అసలు ఆ ఛాన్స్ ఏంటో ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకుందాం…
నాగచైతన్య నటించిన సవ్యసాచి
సినిమాతో నిధి టాలీవుడ్ కు పరిచయమైంది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా నిధి తనదైన నటన మరియు గ్లామర్ షో తో యూత్ ను బాగానే అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను
లో మెరిసిన ఈ అమ్మడికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్రేక్ వచ్చింది.
ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ .. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇటీవలే ఈ బ్యూటీ కలగ తలైవాన్
అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఉదయనిధి స్టాలిన్ హీరోగా చేస్తే.. ఆయనకు జోడీగా నిధి అగర్వాల్ నటించింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యుంటే కోలీవుడ్ లో నిధికి స్టార్ ఇమేజ్ దక్కేది. కానీ అలా జరగలేదు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిధి అగర్వాల్ కు నిరాశే ఎదురైంది.
ఇక ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా హరిహర వీరమల్లు
అనే సినిమాలో నటిస్తోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమానుమెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే కోలీవుడ్ లోనూ పలు ప్రాజెక్ట్స్ కు ఈ బ్యూటీ సైన్ చేసిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ భేటీలో పాల్గొన్న నిధి అగర్వాల్ కోలీవుడ్ స్టార్ ధనుష్ పై తన అభిమానాన్ని తెలుపుతూ మాట్లాడింది.
ఆయన అంటే ఎంత ఇష్టమో తెలిపింది.. అంతేకాదు ఆయన సినిమాలో నటించే ఛాన్స్ వస్తే చాలు అంటుంది.అయితే ఆ సినిమాకు రెమ్యునరేషన్ కూడా వద్దు అంటూ చెప్పేసింది. మొత్తానికి డబ్బు ఇవ్వకపోయినా ధనుష్ తో నటించే అవకాశాన్ని ఇస్తే చాలని నిధి అగర్వాల్ చెప్పకనే చెప్పేసింది. దీంతో ఈమె వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ధనుష్ తో నటించాలనే నిధి ఆశ తీరుతుందో..? లేదో.. తెలియాల్సి ఉన్నాయి.. కాగా, ధనుష్ ప్రస్తుతం తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నారు. ఈయన నటించిన సార్
చిత్రం విడుదలకు సిద్ధం ఉంది.ఇక తెలుగులో డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్షకత్వంలో నటించనున్నాడు.ఆ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది..