ప్రభాస్ ఇండస్ట్రీ లో ఉన్న ప్రతీ ఒక్కరితో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంత సన్నిహితంగా ఉంటాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అసలు ప్రభాస్ ని చూస్తే ఒక పాన్ వరల్డ్ సూపర్ స్టార్ లాగానే అనిపించడు. మన లాగానే చాలా సాధారణమైన వ్యక్తి లాగానే అనిపిస్తాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే తత్వమే ఆయనని అభిమానులకు ఇంత చేరువ చేసింది. ఇక ఇండస్ట్రీ లో ఆయనకీ ఎంత మంది స్నేహితులు ఉన్నారో తెలిసిందే.
వారిలో ప్రముఖ హీరో ‘గోపీచంద్’ కూడా ఒకడు. ‘వర్షం’ సినిమా నుండి వీళ్లిద్దరు ప్రాణ స్నేహితులు లాగ మారిపోయారు. వీళ్ళ మధ్య ఉన్న స్నేహం మరియు చనువు చూస్తూ ఉంటే, మనం మన స్నేహితులతో ఎలా ఉండేవాళ్ళమో గుర్తుకొస్తాది. ఇది ఇలా ఉండగా ప్రభాస్ గోపీచంద్ కోసం ఒకసారి మేకప్ మ్యాన్ గా కూడా మారిపోయాడు అనే విషయం ఎవరికైనా తెలుసా!.
ఇక అసలు విషయానికి వస్తే గోపీచంద్ కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ ‘జిల్’. రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా గోపీచంద్ ని చెయ్యమని చెప్పింది ప్రభాస్ అట, అంతే కాదు అప్పటి వరకు ఊర మాస్ హీరో లుక్స్ ఉన్న గోపీచంద్ ని ఎంతో స్టైలిష్ లుక్ తో కనపడేలా చేసింది కూడా ప్రభాస్ అట.
తన లుక్ ని మార్చడానికి ఏమాత్రం ఆసక్తి చూపని గోపీచంద్ ని బలవంతం పెట్టి ప్రభాస్ ఏ మేకప్ మ్యాన్ చేత హెయిర్ స్టైలింగ్ నుండి కాస్ట్యూమ్స్ వరకు దగ్గరుండి చేయించాడట. అంతే కాదు ప్రభాస్ కూడా మేకప్ మ్యాన్ అవతారం ఎత్తి గోపీచంద్ కి హరి స్టైలింగ్ సెట్ అయ్యేలా చేసాడట.ఈ విషయాన్నీ స్వయంగా ప్రభాస్ ఏ చెప్పాడు, గతం లో ఆయన పాల్గొన్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK‘ షో లో చెప్పుకొచ్చాడు.