రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ బ్యూటీ బీ టౌన్ లో ఎక్కువగా ఈవెంట్స్ కు హాజరవుతోంది. ఇందులో భాగంగానే ఈ భామ డిఫరెంట్ ఔట్ ఫిట్స్ లో కనిపిస్తూ సందడి చేస్తోంది. మొన్నటి దాకా ఈ బ్యూటీ ట్రెండీ ఔట్ ఫిట్స్ .. బోల్డ్ లుక్స్ తో నెట్టింట సెగలు పుట్టించింది. గత మూడ్రోజులుగా మాత్రం ఈ భామ ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటోంది.
తాజాగా రకుల్ ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది. రెడ్ కలర్ శారీలో విరబూసిన మందారం పువ్వులా మెస్మరైజ్ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజులో ట్రెడిషనల్ ఔట్ ఫిట్ కు కాస్త ట్రెండీనెస్ యాడ్ చేసింది. ఈ చీరలో రకుల్ చాలా అందంగా కనిపిస్తోంది. చేతిలో స్లింగ్ బ్యాగ్ తో రకుల్ స్టైలిష్ గా కనిపించి అలరించింది. ఈ బ్యాగ్ విలువ లక్షల్లో ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి రకుల్ ట్రెడిషనల్ లుక్ ను చాలా ఎలిగెంట్ గా క్యారీ చేసింది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిన్న ఎల్లో శారీలో మెస్మరైజ్ చేసిన రకుల్.. ఆ మత్తు నుంచి తేరుకోకముందే రెడ్ శారీలో కనువిందు చేసిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా అమ్మాయిలకు చీర సెట్ అయినట్టు ఏ ఔట్ ఫిట్ అంతగా నప్పదని కొందరు కామెంట్లు చేస్తుండగా.. రకుల్ ఏ ఔట్ ఫిట్ లో అయినా అందంగానే కనిపిస్తుంది అంటూ మరికొందరు సపోర్ట్ ఇస్తున్నారు. రకుల్ చీరలో బుట్టబొమ్మలా ఉందంటూ మరికొందరు హార్ట్ ఎమోజీస్ తో తమ ప్రేమను కురిపించేస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు లేక బాలీవుడ్ పైనే తన ఫోకస్ అంతా పెట్టింది. అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తరచూ బీ టౌన్ ఈవెంట్లలో తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీతో కలిసి సందడి చేస్తోంది. అయితే ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందని కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ జంట విడిపోయిందంటూ బీ టౌన్ మీడియా కోడై కూస్తోంది.