100 Years Of Legendary NTR : మహానటుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జన్మించి నేటితో వందేళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నేడు విజయవాడ లోని అనుమోలు గార్డెన్స్ లో పోరంకి మండలం లో జరిపించారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ గ్రాండ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ముందుగా విజయవాడ కి మధ్యాహ్నం చేరుకున్న రజినీకాంత్ ని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఇంటికి రజినీకాంత్ ని తేనెతి విందు కి ఆహ్వానించాడు,ఆ తర్వాత ఆయనని సగౌరవగంగా సత్కరించి అతిథి మర్యాదలు చేసాడు.
అనంతరం బాలకృష్ణ మరియు చంద్ర బాబు నాయుడు తో కలిసి రజినీకాంత్ పోరంకి కి బయలుదేరాడు. అక్కడ ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి తారకరామారావు తో తనకి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ, అలాగే మిత్రులు బాలయ్య మరియు చంద్రబాబు నాయుడు గురించి కూడా ఎంతో గొప్పగా మాట్లాడాడు.
ముఖ్యంగా బాలయ్య గురించి ఆయన మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యపరిచింది, ఆయన మాట్లాడుతూ ‘బాలయ్య లాంటి నటుడు భారత దేశం లోనే లేడు, ఆయన చేసే కొన్ని సన్నివేశాలు ఇండియా లో నేను , అమిర్ ఖాన్ , కమల్ హాసన్ ఇలా ఎంత మంది సూపర్ స్టార్స్ చేసిన జనాలు ఒప్పుకోరు. అది కేవలం బాలయ్య కి మాత్రమే సొంతం, అతను నాకు మంచి మిత్రుడు కూడా’ అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ గారితో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది, ఆయన నన్ను తన సొంత సోదరుడిగా భావించే వాడు, ఆయనతో కలిసి నేను ‘టైగర్’ అనే చిత్రం లో నటించాను.అలాంటి మహానుభావుడితో కలిసి నటించడం నా అదృష్టం , అందుకు నేను ఎంతో గర్విస్తున్నాను, అప్పట్లో ఆయన షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు తన సొంత తమ్ముడిలాగానే ట్రీట్ చేసేవాడు.
ఆయన కేవలం తెలుగు సినిమాకి మాత్రమే కాదు, ఈ భారత దేశానికే ఎంతో ఉన్నత సంపద లాంటి మనిషి, ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు తరతరాలు గుర్తుండిపోతాయి, ఇప్పటికీ ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు అమలు అవుతున్నాయి, కారణం జన్ముడు లాంటి ఆ మహానుభావుడి జన్మదిన వేడుకులకు వచ్చినందుకు చాలా అనందం గా ఉంది’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.