Jabardasth Faima: జబర్దస్త్ ఫైమా గురించి అందరికి తెలుసు.. ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా జబర్దస్త్ షో ద్వారా లేడీ కమెడియన్ గా అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యింది.. ఫైమా తనదైన శైలిలో వేసే పంచ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. దాంతో ఫైమా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. కొద్ది రోజులు జబర్దస్త్ లో చేసింది.. ఆ తర్వాత రోజుల్లో బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఫైమ ఈ షో ద్వారా కూడా మంచి పేరును సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ షో వల్ల ఫైమా ఆర్థికంగా కూడా స్థిరపడ్డారని సమాచారం అందుతోంది.. దాంతో సొంత ఇల్లు కూడా కొందని తెలుస్తుంది.. ఇప్పుడు ఫైమాకు కాబోయే భర్త ఇలా ఉండాలట అంటూ ఓ వార్త వినిపిస్తుంది..

స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే పలు షోలలో ఫైమా సందడి చేస్తున్నారు. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఫైమా నన్ను చిన్నపిల్లలా చూసుకోవాలి అని చెప్పింది.. మూడు వస్తే ముద్దులు ఇవ్వాలని, ఇంక ఎన్నో ప్రేమగా చెయ్యాలని చెప్పింది.. దానిపై ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఫైమా పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్టు గతంలో కొన్ని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రవీణ్, ఫైమా వేర్వేరు షోలతో బిజీగా ఉండటంతో వీళ్లిద్దరూ కలిసి కనిపించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి… ఇకపోతే ఇప్పుడు ఫైమా పెళ్లి గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి..

ఇక కేరీర్ విషయానికొస్తే.. ఫైమా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఫైమా త్వరలో పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి. ఫైమాకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని ఆమె అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. ఇతర ఛానెళ్లలో కూడా ఫైమాకు ఆఫర్లు వస్తున్నా బిగ్ బాస్ షో అగ్రిమెంట్ వల్ల ఆమె ఆ ఆఫర్లకు నో చెబుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది… ఇక సినిమాల్లో కూడా నటిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..