స్టార్ హీరోయిన్ Samantha గత కొంతకాలం గా మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇది ఒక ప్రాణాంతక వ్యాధి అని అప్పట్లో ప్రచారమైంది, సమంత పలు ఇంటర్వ్యూస్ లో దీని గురించి మాట్లాడుతూ కంటతడి కూడా పెట్టుకుంది.అయితే సరైన చికిత్స తీసుకొని ప్రాణాపాయం నుండి బయటపడిన సమంత రీసెంట్ గా ‘ఖుషి’ మరియు ‘సిటాడెల్’ షూటింగ్స్ లో యాక్టీవ్ గా పాల్గొంటుంది.ఇక సమంత కి ఎలాంటి కష్టం లేదు, మయోసిటిస్ ని జయించింది అంటూ అభిమానులు సంతోషించారు.
అయితే రీసెంట్ గా విడుదలైన శాకుంతలం మూవీ ప్రొమోషన్స్ లో మయోసిటిస్ నాకు ఇంకా పూర్తిగా తగ్గలేదని చెప్పుకొచ్చింది.అలసట మరియు నీరసం తో బాధపడుతున్నాని,నా కళ్ళు కాంతిని చూడలేకపోతుందని, అందుకే అద్దాలు ధరించాను అంటూ చెప్పుకొచ్చింది సమంత.అయితే దానికి తగిన చికిత్స రోజూ తీసుకుంటూనే ఉన్నానని, త్వరలోనే సంపూర్ణంగా కోలుకుంటానని చెప్పుకొచ్చింది.
అయితే సమంత రీసెంట్ గా వెంటిలేటర్ పై ఆక్సిజన్ మాస్క్ వేసుకున్న ఫోటోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.అయ్యో మా అభిమాన హీరోయిన్ కి ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందారు.
అయితే ఆ తదుపరి పోస్టు లో సమంత వివరిస్తూ ‘ ఇది హైపర్ బేరిక్ తెరఫీ కోసం వేసుకున్న ఆక్సిజన్ మాస్క్. మయోసిటిస్ కారణంగా నాకు కండరాల బలహీనత ఏర్పడింది, అప్పటి నుండి ఈ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను, ఇది కండరాల వాపు మరియు ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. పాడైన కండరాలను బాగు చేస్తుంది’ అని సమంత చెప్పడం తో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం సమంత చేస్తున్న ‘సిటాడెల్‘ అనే వెబ్ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటుంది. ఇంత సమస్య పెట్టుకొని కూడా ఆమె ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు చెయ్యడం అనేది సాధారణమైన విషయం కాదు. ఆమెకి ఆ దేవుడు కావాల్సిన శక్తిని ఇవ్వాలని ప్రార్థిద్దాము.