Divi Vadthya : బిగ్ బాస్ బ్యూటీ దివి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రతిసారి బోల్డ్ ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టిస్తున్న ఈ భామ తాజాగా కాస్త డోస్ పెంచింది. సాగర తీరాన సాగరకన్య వేషధారణలో అదరగొట్టింది. జలకన్య ఔట్ఫిట్లో అభిమానులను మెస్మరైజ్ చేసింది. బ్లూ అండ్ పింక్ ఔట్ఫిట్లో ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. తన లేత అందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. దివి తాజా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
సాగరకన్య ఔట్ఫిట్లో ఉన్న దివి ఫొటోలు చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అరేయ్.. సిటీకి మరో సొరచేప వచ్చింది రా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఈ సాగరకన్య భలే ఉంది గురూ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇంకొందరేమో సముద్ర తీరాన బంగారు తీగ దొరికిందిరోయ్ అంటూ కొంటె కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి దివి మరోసారి సోషల్ మీడియాలో తన అందాల విస్ఫోటనంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ భామ గత కొద్దిరోజుల నుంచి తన బోల్డ్నెస్తో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. నువ్వు ఇంతకు మించి హాట్ ట్రీట్ ఇవ్వవు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ అజ్ రాంగ్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
హైదరాబాద్‌లో పుట్టిన దివి మోడల్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. అలా నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ చివరకు బిగ్‌బాస్‌ను చేరింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఈ బ్యూటీ సందడి చేసింది. ఆ సీజన్లో దివి ఎక్కువగా బాబా మాస్టర్‌తో క్లోజ్‌గా ఉండేది. ఇద్దరూ కలిసి ప్రేక్షకులను చాలా ఎంటర్టైన్ చేశారు. బిగ్‌బాస్ ద్వారా దివి చాలా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ షోలో తన టాలెంట్‌ను చూపిస్తూ తన ఫ్యూచర్‌కు ఓ రూట్ క్రియేట్ చేసుకుంది.
బిగ్ బాస్ షోకు గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కళ్లలో పడింది దివి. అంతే అక్కడే చిరు.. దివికి తన నెక్స్ట్ సినిమాలో నటించే ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని దివికి గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్ర ఇచ్చారు. ఆ పాత్రలో దివి తన నటన ఇరగ్గొట్టింది. ఇక ఆ తర్వాత దివికి అడపాదడపా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం దివి పలు సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన హవా చూపిస్తోంది.