Nidhhi Agerwal : ఆడిషన్ కు పిలిచి ప్రైవేట్ పార్టులు చూపించ‌మ‌న్నాడు..

- Advertisement -

Nidhhi Agerwal : క్యాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి ఇది. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు మొత్తం ప‌ని గ‌ట్టుకుని మ‌రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మ‌ధ్య కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీలో ఇది లేద‌ని చెప్ప‌ను కానీ.. త‌న‌కు మాత్రం ఎప్పుడూ ఎదురుప‌డ‌లేద‌ని చెప్పింది. అంటే క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

తాజాగా నిధి అగర్వాల్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పింది. ఒక దర్శకుడు తనను ఆడిషన్స్ కు పిలిచాడని.. అప్పుడు తన ప్రైవేటు పార్ట్స్ చూపించాలని బలవంతం చేశాడని చెప్పింది. కాస్టింగ్ కౌచ్(casting couch) అనేది అన్ని చోట్ల ఉంది. నేను కూడా కెరీర్ ఆరంభంలో కాస్టింగ్ కౌచ్ కు గురయ్యాను. గతంలో బాలీవుడ్ కి చెందిన ఓ బడా డైరెక్టర్ ఆడిషన్ కు పిలిచి ప్రైవేట్ పార్టులు చూపించు అని అడిగాడు. నీ ప్రైవేట్ పార్టులు పెద్ద‌గా ఉంటేనే ఆఫ‌ర్లు వ‌స్తాయి అంటూ దారుణంగా మాట్లాడాడు. దాంతో నాకు అసహ్యం వేసి అక్కడి ఉంచి వచ్చేశాను. అని చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

Nidhhi Agerwal  Photos

ఇక దీనిపై రాశీ ఖన్నా కూడా ఓపెనైంది. వేధింపులకు గురతున్నవారు ముందుకు వచ్చి దైర్యంగా చెప్పడం చాలా గ్రేట్‌ అన్నారు. ఇలా తమకు ఎరుదైన చేదు అనుభవాలను బయటకొచ్చి నిర్భయంగా చెప్పడం చిన్న విషయం కాదంటుంది రాశీ ఖన్నా. ఇక ‘మీటూ’ అంటూ తనకు చెప్పుకోవడానికి ఏమీ లేదంటుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

వీళ్ళు మాత్ర‌మే కాదు.. ఇండ‌స్ట్రీలో పేరు మోసిన స్టార్ హీరోయిన్లు ఎవ‌రూ క్యాస్టింగ్ కౌచ్ త‌మ‌కు తెలియ‌ద‌నే చెప్తున్నారు. కానీ చిన్న హీరోయిన్లు మాత్రం ఇండ‌స్ట్రీలో ప‌డుకోక‌పోతే అవ‌కాశాలు రావ‌ని నేరుగానే ఓపెన్ అవుతున్నారు. అప్పుడ‌ప్పుడూ కంగ‌న ర‌నౌత్, త‌ను శ్రీ ద‌త్తా, మాధ‌విల‌తా లాంటి హీరోయిన్లు అయితే ఏకంగా ప‌డుకోక‌పోతే ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here