Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకం సమంత.. అంతేకాదు స్టార్ సెలబ్రిటీల పిల్లలు కూడా పెద్దయ్యాక ఏమవుతావు అంటే సమంత అవుతాము అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సమంత ఎంత కష్టపడి పైకి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. పాకెట్ మనీ కోసం యాడ్స్ లో పనిచేసిన ఈమె ఆ తర్వాత షాపింగ్ మాల్స్లో సేల్స్ గర్ల్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత 16 సంవత్సరాల వయసులో మోడలింగ్ లోకి అడుగుపెట్టిన సమంత ఆ సమయంలో తీసుకున్న ఒక ఫోటోను తాజాగా షేర్ చేస్తూ స్వీట్ 16 అంటూ పోస్ట్ చేయడం గమనార్హం.

తాజాగా సమంత షేర్ చేసిన ఈ ఫోటో చాలా అందంగా అద్భుతంగా ఉంది అంటూ నె టిజన్లు సైతం కొనియాడుతున్నారు మొత్తానికైతే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు కెరియర్ పీక్స్ కూడా చూసిన సమంత ని చూసి ఇండస్ట్రీ మొత్తం గర్వపడుతోంది. అంతేకాదు ఒకప్పుడు సేల్స్ గర్ల్ గా పనిచేసిన సమంత నేడు రూ. 6 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నారు అంటే ఈ కామెడి టాలెంటు నటన ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇక సమంత విషయానికొస్తే తాజాగా ఈమె నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ గా నిలిచింది అయినా కూడా సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. మరొకవైపు బాలీవుడ్లో సిటాడెల్ సిరీస్ లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సమంత అందాలకు ఎంతటి వారైనా మోహితులు అవ్వాల్సిందే. ఇకపోతే సినిమా పరంగా సక్సెస్ అయిన ఈమె వ్యక్తిగత జీవితంలో సక్సెస్ కాలేకపోయింది దాంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఏది ఏమైనా ఇకనైనా సమంత సంతోషంగా లైఫ్ లీడ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.