Dharmavarapu Subrahmanyam : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్ స్థానం ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.హాస్యం లో ఈయనకంటూ ఒక ప్రత్యేకమైన మ్యానరిజం ఉంది, బాడీ లాంగ్వేజ్ ఉంది.ఆయన నటించిన హాస్య సన్నివేశాలను ఆధారంగా తీసుకొని ఇప్పటికీ సోషల్ మీడియా లో మీమ్స్ సర్క్యూలేట్ అవుతూనే ఉన్నాయి.మనం కష్టసమయం లో ఉన్నప్పుడు యూట్యూబ్ లో ఆయన హాస్య సన్నివేశాలు చూస్తే కాసేపు మన బాధలన్నీ మర్చిపోగలము.
1989 వ సంవత్సరం లో బావ బావ పన్నీరు అనే చిత్రం లో చిన్న పాత్ర ద్వారా పరిచయమైనా ఈయన, ఆ తర్వార క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ ద్వారా పలు సినిమాల్లో నటించాడు.ఆ తర్వాత కమెడియన్ గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు,అయితే దురదృష్టపుశాతం ఈయన 2013 వ సంవత్సరం లో కన్ను మూసాడు.అప్పటి నుండి ఆయన గురించి సోషల్ మీడియా లో ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు.ఆయన మాట్లాడుతూ ‘నువ్వు నేను మూవీ సక్సెస్ మీట్ కి హాజరై తిరిగి వస్తున్నా సమయం లో నాన్న గారు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు.
ఆయన తలకి 9 కుట్లు కూడా ఉన్నాయి. అలాగే నాన్న గారికి సిగరెట్ తాగే అలవాటు బాగా ఉంది, 2005 వ సంవత్సరం లో రెండు ఊపిరి తిత్తులు దెబ్బతిని పది రోజులపాటు కోమాలో ఉన్నారు. అలా రెండు సార్లు ఆయన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు, కానీ మూడవసారి దీపావళి వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది. డాక్టర్లు చూసి కేవలం 11 నెలలు మాత్రమే బ్రతకగలరు అని చెప్పేసారు. బ్రహ్మానందం గారు నాన్నకి బాలేదని తెలిసి ఇంటికి వచ్చి చూద్దాం అనుకున్నారు. కానీ నాన్నే ఆయనని రానివ్వలేదు, నన్ను ఇలా చూసి తట్టుకోలేవు రావొద్దు అని చెప్పేవాడు’ అంటూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.