Virupaksha సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరూపాక్షా’ ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.22 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా కేవలం మూడు రోజులోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి, లాభాల్లోకి అడుగుపెట్టింది.వేసవి కాలం లో సరైన కమర్షియల్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న ట్రేడ్ కి విరూపాక్ష చిత్రం ఉపశమనం కలిగించింది.
మొదటి రోజు కంటే రెండవ రోజు మరియు మూడవ రోజు ఎక్కువ వసూళ్లు రావడం విశేషం.ఇలా గతం లో కన్నడ చిత్రం ‘కాంతారా’ కి జరిగింది, మళ్ళీ అదే మ్యాజిక్ ఇప్పుడు విరూపాక్ష విషయం లో జరుగుతుంది.అయితే ‘కాంతారా’ చిత్రం ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తే, విరూపాక్ష చిత్రం ఫుల్ రన్ 150 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అయితే ఈ చిత్ర మూవీ టీం హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లో అతిధులుగా విచ్చేసి ఆడియన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.ఈ క్రమం లో డైరెక్టర్ కార్తీక్ దండు మొబైల్ ఫోన్ మరియు నిర్మాత BVSN ప్రసాద్ పర్సుని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారట.తమ దగ్గర ఈ వస్తువులు పోయాయని బయటకి వచ్చి చూసిన తర్వాత తెలిసిందని, అందుకే పోలీస్ రిపోర్టు ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది.
డైరెక్టర్ కార్తీక్ మొబైల్ లో ఆయన సినిమాలకు సంబంధించిన డేటా, అలాగే ఇండస్ట్రీ లో స్టార్ హీరోలకు సంబంధించిన మొబైల్ నంబర్స్, హీరోయిన్ నంబర్స్ ఇవన్నీ ఉంటాయి.మరి దీనిని ఆయన ఎలా మళ్ళీ తిరిగి రప్పించుకుంటాడో చూడాలి.ఇక ‘విరూపాక్ష‘ కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి మూడు రోజుల్లోనే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వర్కింగ్ డేస్ లో కూడా ఇదే రేంజ్ ఊపుని కొనసాగిస్తుంది అనే నమ్మకం తో ఉన్నారు బయ్యర్స్.