Naresh Pavitra: సీనియర్ నటులు నరేష్, పవిత్రల వ్యవహారం సోషల్ మీడియాలో ఏ రేంజులో రచ్చ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం.. ఈమధ్య గాసిప్ రాయుళ్లకు వీరి జంట కాసుల వర్షం కురిపించింది.. విభేదాలతో నరేష్ ఫ్యామిలీ రచ్చ కేక్కింది.. దీంతో ఆయన మూడో భార్య రమ్యా రఘుపతికి కూడా దూరం అయ్యాడు..అయితే చాలా కాలంగా నరేష్ పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నాడు..వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి.. పెళ్లి పేరుతో జనాలకు ఆసక్తి కలిగిస్తూనే చివరికి అదంతా ఉత్తుత్తి అంటూ సినిమాను ప్రకటించారు..

మళ్ళీ పెళ్లి’ అనే చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్ లు ఆడియన్స్ లో ఉత్కంఠని పెంచాయి. ఆ మధ్యన నరేష్ పవిత్ర లిప్ కిస్ పెట్టుకునే వీడియో ఒకటి రచ్చ చేసింది. దీనితో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇందంతా సినిమాలో భాగం అని ఇటీవల వెలుగులోకి వచ్చింది..అయితే తాజాగా ‘మళ్ళీ పెళ్లి’ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. ఇంటి వ్యవహారాలు, ప్రేమ, పెళ్లి లాంటివి ఏ సెలెబ్రిటీలు అయినా సీక్రెట్ గా ఉంచే ప్రయత్నం చేస్తారు. కానీ మళ్ళీ పెళ్లి టీజర్ చూస్తుంటే నరేష్ తన ఫ్యామిలీ గుట్టు మొత్తాన్ని తెరమీద చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతోంది.. దీంతో వీరిద్దరూ బరితెగించారు అని కామెంట్లు వినిపిస్తున్నాయి..
బయట వీరి విభేదాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.. ఇక రమ్య పాత్రలో వనిత విజయ్ కుమార్ నటిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు..టీజర్ చూస్తుంటే.. నరేష్ రమ్యరఘుపతిని టార్గెట్ చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ‘ముడ్డి కింద అప్పులు, ఒంటి నిండా రోగాలు పెట్టుకున్న నీతో సరసం ఏంటే అంటూ తన భార్యని నరేష్ ఒక అసభ్యకరమైన బూతు తిడుతున్నాడు. పెళ్ళాన్ని అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు అంటూ వనిత తిరిగి కౌంటర్ ఇచ్చింది..రమ్య రఘుపతి నరేష్ ని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన సంఘటనలని ఈ చిత్రంలో వనితతో చేయించారు. మైసూరు హోటల్ రూమ్ లో నరేష్, పవిత్ర ఉండగా రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని పట్టుకుంటుంది. అక్కడా నానా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాలని కూడా టీజర్ లో చూపించారు.. మొత్తానికి ఈ టీజర్ లో నరేష్ ఇంటి గుట్టును బయట పెట్టారు.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి..