Payal Rajput: ఈ టాలీవుడ్ సెన్సేషన్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఈ బ్యూటీ పోస్టు చేసే ఫొటోల కోసం కుర్రాళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఒక్క ఫొటో పోస్టు చేసిందంటే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంది. ఆ విషయం ఈ భామ ఫాలోవర్ల సంఖ్యను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. తాజాగా పాయల్ రాజ్ పుత్ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. సమ్మర్ హాలీడేస్ ని పాయల్ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. విదేశీ విహారంలో ఉన్న ఈ భామ ఓ పార్కులో సందడి చేసింది. అక్కడ చిన్నపిల్లలా మారిపోయి జాలీగా గడిపింది. పార్కులో ఉన్న జంతువుల బొమ్మలతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. క్రేజీ పోజులిస్తూ చిన్నపిల్లలా కేరింతలు కొట్టింది. ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోల్లో పాయల్ ని చూసి కుర్రాళ్లు సర్ ప్రైజ్ అవుతున్నారు. పాయల్ చిన్నపిల్లలా కేరింతలు కొట్టడం చూసి ఖుష్ అవుతున్నారు. ఎప్పుడూ హాట్ అండ్ బోల్డ్ లుక్ లో కనిపించే ఈ భామ క్యాజువల్ లుక్ లో కనిపించడం చూసి షాక్ అవుతున్నారు. పాయల్ ఈజ్ సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హార్ట్ ఎమోజీస్ తో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసినా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరిచింది. తొలి సినిమాలోనే ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఈ భామ డేరింగ్ కి నిదర్శనం అని చెప్పొచ్చు. ఆ సినిమాతో పాయల్ కు యూత్ లో క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత ఆర్ డీఎక్స్ లవ్, వెంకీ మామ వంటి పలు సినిమాల్లో అలరించింది. అందం, అభినయం ఉన్నా ఈ బ్యూటీకి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.