Trisha Krishnan .. ఈ భామకు వయసు పెరుగుతున్న కొద్ది అందం కూడా పెరుగుతోంది. 39 ఏళ్ల వయసులోనూ ఈ బ్యూటీ కుర్రదానిలాగే కనిపిస్తోంది. తన అందం చిలిపితనంతో ఇప్పటికీ కుర్రాళ్లను తన గుప్పిట్లో పెట్టుకుంది త్రిష. ఈ భామ తాజాగా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రచారం కోసం సౌత్ ఇండియా అంతా చుట్టేస్తోంది. ఇందులో భాగంగానే రకరకాల ఔట్ ఫిట్స్ లో కనిపిస్తూ ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తోంది.
ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు త్రిష మాయలో పడిపోతున్నారు. 39 ఏళ్ల వయసులోనూ ఈ భామ నేటి తరం యంగ్ హీరోయిన్లకు టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు గడిచినా ఈ భామకు క్రేజ్ తగ్గలేదు. అవకాశాలు అంతకన్నా తగ్గలేదు. ఇప్పటికీ ఈ బ్యూటీ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. తాజాగా త్రిష పింక్ కలర్ చుడీదార్ లో సందడి చేసింది. ఈ ఔట్ ఫిట్ లో త్రిషను చూసి కుర్రాళ్ల హాట్ బీట్ రైజ్ అవుతోంది. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా.. ఈ భామ 16 ఏళ్ల కుర్రదానిలా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
పింక్ కలర్ చుడీదార్ లో త్రిష అదరహో అనిపించేలా కనిపిస్తోంది. సోఫాలో కూల్ గా కూర్చొని స్టైలిష్ పోజులతో అదరగొట్టింది. క్యాజూవల్ పోజులతోనే ఈ భామ కుర్రాళ్లను కవ్వించింది. త్రిష ఫొటోలు చూసి కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. సూపర్ కూల్ గా ఉన్నావ్ త్రిష అంటూ కామెంట్లు పెడుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 లో మహారాణి కుందవిగా త్రిష అలరించిన విషయం తెలిసిందే. ఈ పాత్రలో త్రిష ఈజ్ తో నటించిందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. పార్ట్ 2లో ఈ భామ పాత్ర ఇంకా స్ట్రాంగ్ గా ఉండనున్నట్లు టాక్.
ఇక త్రిష వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ భామ. ఆ తర్వాత వరుస అవకాశాలతో టాలీవుడ్ లో దూసుకెళ్లింది. అగ్రహీరోలందరితో నటించిన ఈ భామ యంగ్ హీరోలతోనూ రొమాన్స్ చేసింది. ఇక కొన్నాళ్ల తర్వాత తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేయడం మానేసి తమిళ్ లోనే సెటిల్ అయిపోయింది.