Kalyan Dev : సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ రావడం అనేది సర్వసాధారణం..పెద్ద పెద్ద హీరోలు మరియు హీరోయిన్లు సైతం వీటి నుండి తప్పించుకోలేరు.కొంతమంది చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంటారు, కొంతమంది వీటిని ఇక మనం ఆపలేము అని అర్థం చేసుకొని తమ పని తాము చేసుకుంటూ ఉంటారు.అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి రెండవ అల్లుడు కళ్యాణ్ దేవ్ తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కళ్యాణ్ దేవ్ శ్రీజా కి గత కొంతకాలం నుండి దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే.వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియా లో ఎన్నో వార్తలు వచ్చాయి, ఈ వార్తలపై అటు కళ్యాణ్ దేవ్ కానీ, ఇటు శ్రీజా కానీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.దీనితో మెగా ఫ్యాన్స్ లో కొంతమంది ఈ వార్తపై కళ్యాణ్ దేవ్ ని తప్పుబడుతూ తన ప్రతీ పోస్ట్ క్రింద నెగటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు.
వీటిపై ఇన్ని రోజులు స్పందించని కళ్యాణ్ దేవ్, ఇప్పుడు వారిని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఒక స్టోరీ పెట్టాడు. తన కూతురుని బాగా మిస్ అవుతున్నాను అంటూ ఆయన పెట్టిన ఆ స్టోరీ లో ఇంకా ఏమన్నాడు అంటే ‘ఇతరుల పట్ల జాలి , దయ వంటివి చూపించాలి, ఎందుకంటే వాళ్ళు బడుతున్న బాధ, మానసిక క్షోభ గురించి మీకు తెలిసింది గోరంత, తెలియనిది కొండంత.. దయచేసి నా నోరు విప్పించొద్దు’ అంటూ ఆయన పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇది తనని ఉద్దేశించి నెగటివ్ కామెంట్స్ చేస్తున్న కొంతమంది మెగా ఫ్యాన్స్ కి ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అర్థం అవుతుంది. మరి కళ్యాణ్ దేవ్ ఈ కౌంటర్ ఇచ్చిన తర్వాత అయినా నెగటివ్ కామెంట్స్ ఆగుతాయా..? ఒకవేళ ఆగకపోతే ఆయన రియాక్షన్ ఏమిటి..? అనేది చూడాలి.