Srikanth : సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు.కొంతమంది మధ్యలోనే విడిపోయిన సందర్భాలను మనం ఎన్నో చూసాము,కానీ ఎన్ని దశాబ్దాలు అయినా కూడా అనోన్య దాంపత్య జీవితం గడుపుతూ ఆదర్శ దంపతులుగా నిల్చిన సెలెబ్రిటీలు కూడా ఎంతో మంది ఉన్నారు, వారిలో ఒకరు శ్రీకాంత్ – ఊహ జంట.వీళ్లిద్దరు అప్పట్లో కలిసి సుమారుగా నాలుగు సినిమాల్లో నటించారు.
సినిమాల షూటింగ్స్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం పుట్టడం, ఆ తర్వాత అది ప్రేమగా మారడం జరిగింది.అయితే శ్రీకాంత్ – ఊహ ప్రేమలో ఉన్నారనే విషయం తెలుసుకొని,ఊహ కుటుంబం సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారట.ఈ విషయం మీద శ్రీకాంత్ ఎన్ని సార్లు ఊహ కుటుంబ సభ్యులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయిండట.ఈ విషయాన్నీ ఒకరోజు శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవి వద్ద చెప్పుకొని బాధపడ్డాడు అట.
అప్పుడు చిరంజీవి ఏమి బాధపడొద్దు, మీ ఇద్దరి పెళ్లి జరిగేలా నేను చూసుకుంటాను అని చెప్పి, స్వయంగా ఊహ తల్లితండ్రుల వద్దకి వచ్చి మాట్లాడాడట.మెగాస్టార్ లాంటి స్థాయి ఉన్నోడు శ్రీకాంత్ కోసం వచ్చాడంటే, కచ్చితంగా శ్రీకాంత్ మంచి అబ్బాయి అయ్యి ఉంటాడని నమ్మి వీళ్లిద్దరికీ పెళ్లి చేసేసారట.అప్పటి నుండి చిరంజీవి మరియు శ్రీకాంత్ మధ్య ఉన్న అనుబంధం సొంత అన్నదమ్ముల అనుబంధం లాగ మారిందని అంటుంటారు ఇండస్ట్రీలో.
ఇప్పటికీ శ్రీకాంత్ తన ఇంట్లో ఏ శుభ కార్యక్రమం మొదలు పెట్టినా ముందుగా చిరంజీవి ఆశీర్వాదం తీసుకుంటాడు,అంత గౌరవం ఆయనకీ చిరంజీవి అంటే.ఇక శ్రీకాంత్ ప్రస్తుతం చేతినిండా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.ఇప్పటికే రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న శ్రీకాంత్, ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు.వీటితో పాటుగా తమిళం మరియు కన్నడ బాషలలో కూడా ఆయన వరుసగా సినిమాలు చేసున్నాడు.