Pushpa: ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాలో సరికొత్త లుక్ కనిపించేందుకు ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టారు.. దీని కోసం జిమ్ లో భారీగా కష్టపడుతూ చెమటలు చిందిస్తున్నారు.. అల్లు అర్జున్ జిమ్ లో కష్ట పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం పుష్ప ది రూల్ . 2021లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్’కు ఇది సీక్వెల్. ఇండియా వైడ్ గా ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పుష్ప రాజ్ మేనియా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతం ‘పుష్ప’ అభిమానులు సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్ కన్నా ఎక్కువగా భారీ అంచనాలను పెంచేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా హైప్ క్రియేట్ చేస్తున్నారు… ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఏ విధంగా ట్రెండ్ అయ్యిందో మనం చూస్తూనే ఉన్నాం..
బన్నీ పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్.. ‘పుష్ప ఎక్కడ?’ అంటూ విడుదల చేసిన ఓ పవర్ ఫుల్ వీడియో నెట్టింటిని షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని భాషల్లో పుష్ప అప్డేట్స్ కు భారీ రెస్పాన్స్ దక్కింది… సినిమా నో డౌట్ రికార్డ్స్ బ్రేక్ అంటూ బన్నీ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు..తాజాగా బన్నీకి సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది..ఆ వీడియోలో బన్నీ జిమ్ లో థ్రెడ్ మిల్ పై రన్నింగ్ చేస్తూ కనిపించాడు. పుష్ప అవతార్ లోనే లాంగ్ హెయిర్ తో ఆకట్టుకున్నారు. ఫిట్ నెస్ బన్నీ మరింతగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం మరో షెడ్యూల్ కు సిద్దం అవుతున్నారు. సీక్వెల్ తో పుష్పరాజ్ ఎలాంటి పార్టీ ఇవ్వబోతున్నారోనని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు..మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యేర్నెని, శంకర్ నిర్మిస్తున్నారు. రూ. 350 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది..