Vidyullekha Raman : ఆడవాళ్ళలో కేవలం హీరోయిన్స్ మరియు క్యారక్టర్ రోల్స్ వేసేవాళ్ళు మాత్రమే కాదు, కమెడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలా నేటి తరం లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి విద్యులేఖ రామన్. 2012 వ సంవత్సరం లో న్యాచురల్ స్టార్ నాని మరియు సమంత కాంబినేషన్ లో వచ్చిన ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, కేవలం పదేళ్లలోనే 40 సినిమాలకు పైగా చేసింది.
ఒకానొక దశలో ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అంత బిజీ ఆర్టిస్టుగా కొనసాగిన ఈమె 2021 వ సంవత్సరం సంజయ్ అనే అబ్బాయి ని పెళ్ళాడి, సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.ఈ ఏడాది ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు, ఆమెనే సినీ ఇండస్ట్రీ కి పెళ్లి తర్వాత దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.
ఇది ఇలా ఉండగా ఈమెకి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈమె తండ్రి పేరు మోహన్ రామన్, ఈయన 1991 వ సంవత్సరం నుండి ఇండస్ట్రీ లో నటుడిగా కొనసాగుతున్నాడు. ఇదయం అనే తమిళ సినిమాతో ప్రారంభమైన మోహన్ రామన్ కెరీర్, గత ఏడాది విడుదలైన పొన్నియన్ సెల్వన్ అనే చిత్రం వరకు కొనసాగింది.
ఈ సినిమా ఆయనకీ నటనకి ప్రాధాన్యం ఉన్న ‘అనిరుద్ధ బ్రహ్మరాయర్’ పాత్ర పోషించాడు. ప్రారంభం నుండి చివరి వరకు హీరో కార్తీ పక్కన కనిపించే నటుడు మరెవరో కాదు, ఈయనే. ఈ నెలలో విడుదల అవ్వబోతున్న ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 లో కూడా నటించాడు ఆయన. అంత పెద్ద ఆర్టిస్టు కూతురుగా ఇండస్ట్రీ లో విద్యులేఖ రామన్ హీరోయిన్ గానే అడుగుపెట్టొచ్చు, కానీ ఆమె రొటీన్ కి బిన్నంగా కమెడియన్ అయ్యింది.