Anchor Anasuya : ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (anasuya) సోషల్ మీడియాలో ఏం కామెంట్ చేసినా అది చర్చనీయాంశమవుతోంది. నెట్టింజ ఆమె పెట్టే పోస్టులు వైరల్ కావడంతో పాటు కొన్నిసార్లు వివాదాలకు కూడా దారితీస్తున్నాయి. గతంలో తనను ఆంటీ అంటున్నారని కొంతమంది నెటిజన్లపై అనసూయ విరుచుకపడటంతో అది పెద్ద వివాదంగా మారింది. ఇటీవల అనసూయ తన ట్వీట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగోపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండిగో సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇంత వరకూ బానే ఉన్నా.. ఆ సంస్థపై మండిపడ్డ అనసూయ వాళ్లు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం తీసుకుని థ్యాంక్స్ చెప్పింది. దీంతో నెటిజన్లు ఆమెపై కామెంట్స్ పెడుతున్నారు. వాళ్లనే తిట్టి.. వాళ్లు ఇచ్చిన గిఫ్ట్ ఎలా తీసుకున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది ఏం పని అంటూ ట్రోల్ చేస్తున్నారు. “ఇండిగోను నేను వ్యక్తిగతంగా ద్వేషిస్తున్నాను. ఈ డొమస్టిక్ ఎయిర్‌లైన్స్ సంస్థ మనపై ఆధిపత్యం చెలాయించడం బాధాకరం. అస్సలు వీరి సేవల్లో నాణ్యతే ఉండదు.” అంటూ అనసూయ తన ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. అయితే తాను ఎందుకు ఇండిగోను వ్యతిరేకిస్తున్నారో మాత్రం అనుసూయ చెప్పలేదు. దీంతో అక్కడి సిబ్బంది అనసూయకు ప్రత్యేక బహుమతి పంపారు.
అనసూయకు క్షమాపణలతో కూడిన ఓ సర్ప్రైజింగ్ ప్యాక్‌ని ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ పంపించింది. ఇందులో తమ ఎయిర్‌లైన్‌లో ప్రయాణించినందుకు ధన్యవాదాలు చెబుతూ, హ్యాపీ జర్నీ అని పేర్కొంది. వారి సర్‌ప్రైజ్‌కి ఫిదా అయిన అనసూయ తానే తొందరపడ్డానని పేర్కొంది.
సరే నేను నిన్న తొందరపడ్డాను. ఇది ఒక నిర్ధిష్ట నగరంలో ప్రాంతీయ సమస్య కవొచ్చు, ఇదిగో నాకు ఇష్టమైన రాజమండ్రి విమానాశ్రయంలో జయంత్, రామ, ఇండిగో బృందం చేసిన స్వీట్ గెచ్చర్(మధురమైన సంజ్ఞ)కి ధన్యవాదాలు. మీ సిబ్బంది అందరు ఇంత ఆప్యాయంగా, స్వాగతించేలా ఉండాలని కోరుకుంటున్నా అని పేర్కొంది. తాను నిరాశని వ్యక్తం చేసినప్పుడు నా ఆనందాన్ని కూడా వ్యక్త పరచాలి. మీకు తెలిసిందే కాదా, అనసూయ ముక్కుసూటి మనిషి అని, ఏదున్నా ఎదురుగానే మాట్లాడుతుందని. ఓకే సీ యూ` అంటూ పేర్కొంది అనసూయ. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.