Anchor Suma గురించి అందరికి తెలుసు..సినిమా ఫంక్షన్స్ సక్సెస్ అవ్వాలంటే సుమ యాంకరింగ్ ఉండాల్సిందే.. అంతలా ఫెమస్ అయ్యింది.. మలయాళి అయిన సుమ తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటూ ఇప్పుడు టాప్ యాంకర్ గా అందరి మనసును దోచుకుంది.. యాంకర్ సుమ గురించి ఇప్పుడో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే రాజీవ్ కనకాల కన్నా ముందు మరో డైరెక్టర్ తో రొమాన్స్ చేసిందని.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఇప్పుడేం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటు బుల్లి తెర, అటు వెండి తెరపై తన హవాను కొనసాగిస్తుంది.. అలాగే స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు, ఆడియో ఫంక్షన్లకు వారిని ఇంటర్వ్యూ చేయడానికి కచ్చితంగా సుమనే కావాలి అంటారు చాలామంది హీరో హీరోయిన్లు. అంతలా సుమా తన యాంకరింగ్ తో ఫేమస్ అయ్యింది. అయితే మొదట్లో సుమ ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదామని వచ్చిందట.
ఇక అలాంటి టైంలో స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారట.. ఆ సినిమానే కల్యాణ ప్రాప్తిరస్తు.. ఈ సినిమాలో సుమ హీరోయిన్ గా వక్కంతం వంశీ హీరోగా చేశారు. ఇక ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉంటాయి. అయితే ఎన్నో ఆశలతో హీరో హీరోయిన్గా చేసిన వీరి మొదటి సినిమా ఈ ఇద్దరికి సక్సెస్ ఇవ్వలేదు. దాంతో వక్కంతం కథా రచయితగా డైరెక్టర్ గా మారిపోయారు.
ఇక సుమ యాంకరింగ్ రంగాన్ని ఎంచుకొని సక్సెస్ అయ్యింది.. అలా ఇప్పుడు స్టార్ యాంకర్ అయ్యింది.. ఆ సినిమా తర్వాత రెండు మూడు మలయాళ సినిమాలను కూడా చేసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసి ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో రాణిస్తోంది. ఇక గత సంవత్సరం జయమ్మ పంచాయతీ అనే సినిమాలో కీలకపాత్రలో నటించినప్పటికీ ఈ సినిమా కూడా సక్సెస్ ఇవ్వలేదు.. దాంతో మనకు సెట్ కావంటు మళ్ళీ ఈవెంట్స్ కు సెటిల్ అయ్యింది. ఇటీవల యాంకర్ సుమ రిటైర్డ్ అంటూ కొన్ని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.. అందులో నిజమేంటో సుమ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..