AP CM Jagan: ఒకప్పుడు సినిమా అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక వ్యసనం లాంటిది.ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల అయితే క్యూ లో గంటలు గంటలు నిల్చుకొని , చొక్కాలు చింపుకొని టికెట్స్ సంపాదించి సినిమాని చూసే దాంట్లో ప్రేక్షకుడు కిక్ ని ఎంజాయ్ చేస్తుంటాడు.రాను రాను వివిధ ఛాయస్ వస్తూ ఉండడం తో సినిమాలను థియేటర్స్ లో చూసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది.
ఇప్పుడు ఓటీటీ లోనే సినిమాలు విడుదల అయిపోతుండడం తో గడిచిన రెండు మూడు సంవత్సరాలలో థియేటర్స్ లో చూసే జనాల సంఖ్య ఎవ్వరూ ఊహించని రీతిలో పడిపోయింది, ఒకానొక దశలో టాలీవుడ్ సంక్షోభం లో కూడా మునిగిపోయింది.దీనిపై నిర్మాతలు మాట్లాడుకొని ఏ సినిమా అయినా ఇక నుండి నాలుగు వారాలు పూర్తి అయినా తర్వాతనే ఓటీటీ లో విడుదల చెయ్యాలనే రూల్ పెట్టుకున్నారు.అందువల్ల ఇప్పుడు కాస్త థియేటర్స్ కి వచ్చే జనాల సంఖ్య పెరిగింది.
అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెస్తున్న ఒక పథకం సినిమా ఇండస్ట్రీ ని మళ్ళీ పాతాళలోకం లోకి నెట్టేస్తుందా అనే భయం మొదలైంది మేకర్స్ లో.త్వరలోనే సీఎం జగన్ ‘ప్రజల వద్దకు సినిమా’ అనే పథకం ని ప్రారంభించబోతున్నాడు.అసలు విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఫైబర్ నెట్ స్కీం ద్వారా ప్రతీ ఇంటికి అతి తక్కువ ధరతోనే ఇంటర్నెట్ సేవలను అందించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఫైబర్ నెట్ లో అప్పుడే కొత్తగా విడుదలైన సినిమాలు కూడా ఉంటాయట.
నిర్మాతలు ఎవరైనా ఫైబర్ నెట్ తో డీలింగ్స్ కుదిరించుకొని వారి సినిమాలను నేరుగా ఇందులో విడుదల చేసుకునే సౌలభ్యం ఇస్తున్నారట.ఈ రూల్ తప్పనిసరిగా చేసే ఆలోచనలో కూడా ఉందట ప్రభుత్వం, ఇదే కనుక జరిగితే ఇక ఆంధ్ర ప్రదేశ్ లో థియేటర్స్ అన్నీ మూతపడి కల్యాణ మండపాలు గానో, లేదా డీ మార్ట్ గానో మారిపోవడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఈ పథకం కి నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగు సినిమా సర్వనాశనం అయిపోవడం ఖాయం అని అంటున్నారు.మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిర్మాతలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.