Mahesh Babu – Shahrukh Khan ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు మేకర్స్ ఎక్కువగా మల్టీస్టార్రర్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.అప్పట్లో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్న ఎంతో మంది హీరోలు మల్టీస్టార్రర్ సినిమాలు చెయ్యడానికి ఏమాత్రం కూడా వెనకాడేవారు కాదు.హీరోల మధ్య చాలా స్నేహపూర్వకంగా వాతావరణం ఉండడం వల్ల అది సాధ్యమైంది.ఇక ఆ తర్వాతి తరం హీరోల చేతుల్లోకి ఇండస్ట్రీ వెళ్లిపోయిన తర్వాత మల్టిస్టార్రర్స్ జోరు బాగా తగ్గిపోయింది.
టాలీవుడ్ లో పూర్తిగా తగ్గిపోయింది కానీ,బాలీవుడ్ లో మాత్రం ఆ ట్రెండ్ ఆగలేదు, కొనసాగుతూనే ఉన్నింది.అయితే మహేష్ బాబు ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఒక క్రేజీ మల్టీస్టార్రర్ ప్రాజెక్ట్ ని వదులుకున్నాడు.అది కూడా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో చెయ్యాల్సిన సినిమా.ఇంతకీ ఆ సినిమా ఏమిటి, ఎందుకు మహేష్ బాబు అంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని వదులుకున్నాడు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే 2001 వ సంవత్సరం లో షారుఖ్ ఖాన్ – హ్రితిక్ రోషన్ మరియు అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో ‘కభీ ఖుషి కభీ గామ్’ అనే చిత్రం వచ్చింది.అప్పట్లో ఈ సినిమా బాలీవుడ్ లో ఒక సెన్సేషన్,ఆరోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.ఈ సినిమాని తొలుత షారుఖ్ ఖాన్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో తీద్దాం అనుకున్నారట.అప్పట్లో మహేష్ బాబు చిన్న నాన్న ఆదిశేషగిరి రావు గారు అమితాబ్ బచ్చన్ తో సూర్యవంశం సినిమాని రీమేక్ చేసాడు.
అది అక్కడ ఫ్లాప్ అయ్యింది, దాని తర్వాతి సినిమానే ఈ ‘కభీ ఖుషి కభీ గామ్’.ఈ సినిమాలో హ్రితిక్ రోషన్ పాత్రలో మహేష్ బాబు తీసుకుందామని అమితాబ్ బచ్చన్ ఆది శేషగిరి రావు ని అడిగారట, ఇదే విషయాన్నీ మహేష్ బాబు కి తెలపగా ఆయన అప్పట్లో తన పూర్తి ఫోకస్ ని తెలుగు లోనే పెట్టాలనుకుంటున్నానని, బాలీవుడ్ లోకి అడుగుపెట్టే ఆలోచన ఇప్పట్లో వద్దని చెప్పాడట.దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ మహేష్ చేతి నుండి జారిపోయింది.ఒకవేళ ఈ సినిమా ఒప్పుకొని చేసి ఉంటె మహేష్ అప్పట్లోనే స్టార్ హీరో అయ్యేవాడని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అనుకుంటున్నారు.