Deepthi : ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తన తోటి ఆర్టిస్టుతో ప్రేమలో పడిన ఈమె అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన జోడి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదువెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ , మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా వీటన్నింటినీ చూసే ప్రతి ఒక్కరికి ఈ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమధ్య బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఈ జంట అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై కూడా భారీ పాపులారిటీని దక్కించుకుంది.
ఒకప్పుడు పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా, ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న షన్ను , దీప్తి ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ ఎంతలా ఉందంటే ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతారు అన్న స్థాయికి చేరుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఇద్దరు విడిపోవడం జరిగింది . ఇక అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్ముఖ్ కో కంటెస్టెంట్ సిరి తో చాలా చనువుగా మూవ్ అవ్వడమే వీరి బ్రేక్ అప్ కి కారణమయ్యింది. బయటకు వీరు స్నేహితులం అని చెప్పినా సరే లోపల వీరు చేసే చేష్టలు నిజంగా ఒక ప్రేమ జంటను తలపిస్తాయి.
అంతలా వీరి వ్యవహారం బిగ్ బాస్ హౌస్ లో తెగ రచ్చలేపింది. దాంతో విసిగెత్తిపోయిన దీప్తి షన్నూ కు బ్రేకప్ చెప్పేసింది. బ్రేకప్ అయితే చెప్పింది కానీ అతడిని మర్చిపోలేక అప్పటినుంచి ఏదో ఒక రూపంలో షన్నుపై తన ప్రేమను ఆమె బయట పెడుతూనే ఉంది. కానీ షన్ను ను మాత్రం దగ్గరకు తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే రోజుకొక వీడియోని షేర్ చేస్తూ వస్తోంది దీప్తి ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇన్స్టాల్ స్టోరీస్ పెట్టింది అందులో తాను మొదటిసారి పప్పు చేసినప్పుడు తన స్నేహితులు ఇంకొకసారి చేయొద్దని చెప్పారట
ఇప్పుడు చాలా సూపర్ గా చేశానంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది.