Urfi Javed .. సోషల్ మీడియాలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పేరు బాగా తెలుసు.. ఓటిడి బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయింది.. షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి బిగ్ బాస్ ఓటిటి కంటెస్టెంట్ కూడా ఈమె. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఊర్ఫీ వేసుకునే డ్రెస్సులు ఉఫ్.. ఉర్ఫి.. ఇవేం డ్రెస్సులు అనిపించేలా ఉంటాయి. ప్రతినిత్యం విభిన్నంగా కనిపించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలా తను కూడా వెరైటీ డ్రెస్సులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.. తాజాగా ఉర్ఫి జావేద్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన వెంటనే తన వ్యక్తిగత విషయాలను పంచుకొని ఎమోషనల్ అయింది..
ఓ ఇంటర్వ్యూలో ఉర్ఫి మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. తన కుటుంబ సభ్యులు తనను ద్వేషించారని చెప్పింది. గతంలో ఒక ట్యూబ్ ను టాప్ గా ధరించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా.. ఆ ఫోటోను కొందరు అడల్ట్ సైట్లలో అప్లోడ్ చేశారని.. అది తననేనని గుర్తించిన చాలామంది తనను అడల్ట్ స్టార్ అని పిలవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. అలా ఎవ్వరు నా ముందు మాట్లాడినా కూడా వెంటనే ఆ వీడియో నాకు చూపించమని ప్రశ్నించే దానిని చెప్పుకొచ్చింది.
ఆఖరికి ఉర్ఫి జావేద్ తండ్రి కూడా తనపై అడల్ట్ స్టార్ అనే ముద్ర వేయడం చాలా బాధ కలిగించిందని ఎమోషనల్ అయింది. అడల్ట్ సైట్ వాళ్లే మమ్మల్ని 50 లక్షలు అడుగుతున్నారని కన్న తండ్రి అందరికీ ప్రచారం చేయడం చాలా బాధ కలిగించిందని ఎమోషనల్ అయింది. ఈ విషయం తెలిసిన చాలామంది తనని దారుణంగా మాట్లాడేవారని.. కొంతమంది అయితే తనను కొట్టారు కూడా అని తెలిపింది. 15 ఏళ్ల వయసులో తన చెల్లెలు తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లానని అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో లక్నో కి వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డానని ఆమె చెప్పింది. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు అనుభవించానని తెలిపింది.