Ariyana Glory : సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తాడు.. తనకి నచ్చని ఎవరైనా సరే సోషల్ మీడియా ద్వారా తిడతాడు..ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సృష్టించిన వర్మ.. ఈ మధ్యకాలంలో బోల్డ్ కంటెంట్ సినిమాలతో రచ్చ చేస్తున్నారు. అంతేకాదు హాట్ బ్యూటీల అందాలను పొగిడేస్తూ వాళ్ళను ఫేమస్ చేస్తున్నారు.. యంగ్ బ్యూటిస్ తో ఎంత క్లోజ్ గా ఉంటారో చెప్పనక్కర్లేదు.. ఆర్జీవీ తో పరిచయమున్న ప్రతి అమ్మాయి ఇప్పుడు ఓ రేంజులో ఉన్నారు.. అలాంటివారిలో అరియానా గ్లోరీ కూడా ఒకరు..తాజాగా వర్మ తో కలిసి ఉన్న ఒక ప్రైవేట్ ఫోటోను అరియానా పంచుకుంది… అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..

ఈ అమ్మడు ఆర్జీవీ ని చేసిన ఒక బోల్డ్ ఇంటర్వ్యూ తో బాగా ఫెమస్ అయ్యింది.శృంగారానికి సంబంధించిన అంశాలపై ఓపెన్ గా మాట్లాడుకున్నారు. అప్పట్లో ఈ వీడియోలు సంచలనంగా మారాయి..తనకు శృంగారం అంటే పిచ్చి అని పలు సందర్భాల్లో చెప్పారు వర్మ. నిద్ర లేవడంతోనే కొంత సేపు పోర్న్ వీడియోలు చూస్తానని కూడా చెప్పారు. అయితే అరియానా, అషు రెడ్డి లాంటి అమ్మాయిల అందాలపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేయడం వారికి బాగానే ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు..అరియానా చేసిన ఇంటర్వ్యూలో.. అరియానా తొడలపై వర్మ చేసిన కామెంట్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. వర్మ చేసిన తొడల కామెంట్లతో అరియానాకు ఓ రేంజులో క్రేజ్ పెరిగింది.. ఆ క్రేజ్ కారణంగానే బిగ్ బాస్ ఆఫర్ కొట్టేసింది అరియానా…

ఈ క్రమంలోనే తాజాగా ఆర్జీవీతో కలిసి దిగిన ఓ ప్రైవేట్ ఫోటో పంచుకుంటూ ఆయనపై ఓపెన్ కామెంట్స్ చేసింది యంగ్ లేడీ అరియానా. ఈ ప్రపంచంలో నాకు మోస్ట్ క్రేజీయెస్ట్ పర్సన్ నువ్వే అంటూ కిక్కిచ్చే కామెంట్ వదిలింది. దీంతో ఈ ఫొటోతో పాటు ఆమె చేసిన కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది.. వీరిద్దరూ దిగిన పిక్ చూసి.. చూసి నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఆర్జీవీతో జాగ్రత్త అంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతూ కామెంట్స్ చేస్తున్నారు..దీంతో అరియానా మరోసారి ఫెమస్ అయ్యింది.. ప్రస్తుతం అరియనా పలు షోలు, వెబ్ సిరీస్ లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..