Ram Gopal Varma : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరు రామ్ గోపాల్ వర్మ.అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసి పాన్ ఇండియా లెవెల్ లో తన ఖ్యాతిని విస్తరింపచేసుకున్నాడు.బాలీవుడ్ లో కూడా ఈయనకి మంచి క్రేజ్ ఉంది, అయితే ప్రస్తుతం ఈయన చెత్త సినిమాలు , బూతు సినిమాలు తీస్తూ, కాంట్రవర్సీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు.
ఈయనకి కామపిచ్చి కూడా ఎక్కువే, శ్రీదేవి అంటే ఎంతలా పడి చస్తాడో మన అందరికీ తెలుసు, ఈయనకి శ్రీదేవి ఒక్కటే అంత ఇష్టం అనుకుంటే పొరపాటే, అప్పట్లో ఈయన ప్రముఖ హీరోయిన్ జయసుధ ని కూడా ప్రేమించాడట.ఆమెకి పెళ్ళైన విషయం తెలిసి కూడా రామ్ గోపాల్ వర్మ జయసుధ ని లైన్ లో పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేసాడట.రీసెంట్ గా ఈయన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో అప్పట్లో జయసుధ మెప్పు పొందేందుకు ఈయన వేసిన వేషాలను చెప్పుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో రావు గారిల్లు సినిమా షూటింగ్ జరుగుతున్న నేను తోట తరణి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. నాకు జయసుధ అంటే చాలా ఇష్టం ఉండేది, ఈ సినిమాలో జయసుధ హీరోయిన్ అని తెలుసుకొని ఆమె మెప్పుని ఎలా అయినా పొందాలి, ఆమెని ఎలా అయినా కలిసి ఇంప్రెస్స్ చెయ్యాలనే కుతూహలం ఉండేది. సరిగ్గా ఆ సమయం లోనే తోట తరణి గారు నా చేతికి కొన్ని సీన్ పేపర్స్ ఇచ్చి, ఇది జయసుధ ఇంటికి వెళ్లి ఇవ్వమన్నారు.
అంతే కాదు సన్నివేశాలను డెవలప్ చెయ్యమని కూడా చెప్పారు, జయసుధ గారి మెప్పు పొందడానికి, నేను ఎంతో శ్రద్ద పెట్టి సన్నివేశం రాసుకొని ఆమె వద్దకి వెళ్ళాను, ఆమె సీన్ పేపర్ చూస్తున్న సమయం లో అబ్బా ఏమి రాసాడు వీడు అని మెచ్చుకుంటుంది అనుకున్నాను, కానీ ఆమె అదంతా చదివిన తర్వాత ఇంకెన్ని పేజీలు ఉన్నాయి అనగానే ఒక్కసారిగా షాక్ కి గురయ్యాను.మళ్ళీ నేను ‘మని మని’ సినిమా స్క్రిప్ట్ ని వివరించడానికి బాగా రెడీ అయ్యి జయసుధ ఇంటికి వెళ్ళాను, ఆరోజు డోర్ బెల్ కొట్టగానే తలుపులు తెరిచి ఉంది కానీ, ఎవ్వరూ లేరు.. కానీ అటు పక్కనే జయసుధ భర్త నితిన్ కపూర్ ఉన్నాడు. ఇప్పటి వరకు నేను చూసింది ఇతని చెస్ట్ నా అని ఫీల్ అయ్యి, అక్కడితో జయసుధ మీద ఉన్న ప్రేమ మొత్తం చచ్చిపోయింది’అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.