Conductor Jhansi : తెలుగు బుల్లితెరపై ఎంతోమంది తమ టాలెంట్ తో నిరూపించుకొని సక్సెస్ అయిన వారు ఉన్నారు. కొంతమందికి మాత్రమే బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చిన వారికి అదృష్టం వరిస్తూ ఉంటుంది. రెయిన్బోలు కష్టపడి తమ సత్తా చాటుకోవాలని ఎంతోమంది బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. ఇలా ఎన్నో చేదు అనుభవాలను, కష్టాలను, అవమానాలు, ట్రోలింగ్కి కూడా గురికావలసి ఉంటుంది. అలాంటి వారిలో పల్సర్ బైక్ ఝాన్సీ కూడా ఒకరు.
ఈమె పసుపు కండక్టర్గా విధులు నిర్వహిస్తూనే ఎన్నో పాటలకు స్టేజ్ పర్ఫామెన్స్ చేయడం జరిగింది అయితే.. ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి కార్యక్రమంలో పల్సర్ బైకు పాట కు డాన్స్ వేసి మంచి పాపులారిటీ తోపాటు క్రేజీ ని కూడా అందుకుంది. ఇలా ఎన్నో షోల పైన కూడా తన డాన్స్ ఆకట్టుకున్న ఝాన్సీ తాజాగా ఒక షో కి రావడం జరిగింది.. తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను కూడా తెలియజేసింది. ఈ విషయాలన్నీ తెలుపుతూ చాలా ఎమోషనల్ అయ్యింది ఝాన్సీ వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం.
కండక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ తానేమి ఓవర్ నైట్ కి స్టార్ గా మారిపోలేదు దాని వెనకాల 18 సంవత్సరాల కష్టం ఉందని చాలా ఎమోషనల్ అయింది.. ఒకానొక సమయంలో తన తండ్రి కూడా తనకు మద్దతు ఇవ్వలేదు అంటూ ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది.. తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను అవనుభవించానని.. ఒకరోజు బట్టల కోసం కొలతలు కొరవడానికి టైలర్ షాపుకు వెళ్లాను. అందులో కూడా ఒక టైలర్ తన పట్ల తప్పుగా ప్రవర్తించారని.. ఆ సమయంలో కూడా చాలా కోపం వచ్చిందని.. ఈ విషయం తండ్రికి చెప్పి కొట్టిద్దామనుకున్నాను కానీ.. ఆయన నేను నీ తండ్రిని కాదని చెప్పడంతో ఆరోజు చాలా బాధ వేసిందంటూ ఎమోషనల్ అయ్యింది కండక్టర్ ఝాన్సీ .