Samantha సౌత్ ఇండియా లో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించిన సమంత,నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తి గా మారిపోయింది.కేవలం హీరో తో రొమాన్స్ చేసే హీరోయిన్ పాత్రలకు ఆమె టాటా చెప్పేసింది.నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ , బోల్డ్ పాత్రలు వచ్చినా వదలకుండా చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.’ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఈమె కెరీర్ ని ఎవ్వరూ ఊగించని రేంజ్ లో మలుపు తిప్పింది.

ఈ సిరీస్ లో విలన్ గా నటించిన ఆమె నటనకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ ని తీసిన రాజ్ & డీకే లతోనే ఆమె ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తుంది.అమెరికా లో సూపర్ హిట్టైన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కి రీమేక్ గా ఈ సిరీస్ తెరకెక్కనుంది.ఇందులో సమంత రా ఏజెంట్ గా నటించబోతుంది.

ఒరిజినల్ వెర్షన్ లో సమంత పాత్రని ప్రియాంక చోప్రా చేసింది.ఇటీవలే ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.ఇందులో ప్రియాంక చోప్రా బెడ్ రూమ్ లోని రొమాన్స్ సన్నివేశాల్లో రెచ్చిపోయి హద్దులు దాటి నటించింది.ఈమధ్యనే సమంత మీద ఆ సన్నివేశాలను చిత్రీకరించారట, ఈ సన్నివేశాలు మాతృక భాషలో ఉన్న రొమాంటిక్ సన్నివేశాలకంటే బోల్డ్ గా ఉండబోతుందట.సమంత కూడా హద్దులన్నీ చెరిపివేసి ఈ రొమాంటిక్ సీన్స్ లో ప్రియాంక చోప్రా కంటే అద్భుతంగా చేసిందట.

ఇప్పటి వరకు సమంత రొమాంటిక్ సన్నివేశాల్లో అంత బోల్డ్ గా ఎప్పుడూ నటించలేదు.మొట్టమొదటి సారి ఆమె అలాంటి సన్నివేశాల్లో నటించింది అని తెలియడం తో అభిమానులు ఆ సీన్స్ చూసేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.కానీ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది.ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సిరీస్ ఈ ఏడాది చివరి లోపు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.