Aha Newspaper : టాలీవుడ్ లో దిగ్గజ నిర్మాతగా రాణించిన అల్లు అరవింద్, ఓటీటీ రంగం లోకి కూడా అడుగుపెట్టి, ఆహా యాప్ ద్వారా డిజిటల్ మీడియా ప్రపంచం లో సరికొత్త ప్రభంజనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ‘ఆహా మీడియా’ యాప్ కి యూత్ ఎలా కనెక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఒరిజినల్ కంటెంట్ తో పాటుగా, సరికొత్త సినిమాలు, గేమ్ షోస్ మరియు టాక్ షోస్ తో అనతి కాలం లోనే ఇండియాలో టాప్ 10 ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిల్చింది.
ఈ యాప్ ఆ రేంజ్ లో క్లిక్ అవ్వడానికి కారణం ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో అని చెప్పొచ్చు.బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన ఈ బిగ్గెస్ట్ టాక్ షో కి పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు ప్రభాస్ వంటి స్టార్ హీరోలు హాజరవ్వడం తో వినియోగదారుల సంఖ్య ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరింది.
ఇన్ని రోజులు కేవలం ఆన్లైన్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన ఆహా మీడియా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఇంటి గడప తొక్కనుంది.అసలు విషయానికి వస్తే జులై 1 వ తేదీ నుండి ‘ఆహా’ దినపత్రిక అందుబాటులోకి రాబోతుందట.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేసింది ‘ఆహా’ టీం.ఈ దినపత్రికలో రాజకీయాలు, సినిమాలు , క్రీడలు, వ్యాపారం వంటి క్యాటగిరీలు మాత్రమే కాకుండా, రోజుకో ప్రముఖ టాప్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయని సమాచారం.
ఈ దిన పత్రిక ధర 5 రూపాయిల వరకు ఉంటుందని వినికిడి. అయితే అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ కి భందువు కాబట్టి జనసేన పార్టీ కి ఈ దినపత్రిక బాగా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశిస్తున్నారు. డిజిటల్ మీడియా లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన ఆహా మీడియా, పత్రిక రంగం లో కూడా అదే రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తుందా లేదా అనేది తెలియాలంటే జులై వరకు ఆగాల్సిందే.
పొద్దున్నే ఒక చేతిలో కాఫీ, మరో చేతిలో పేపర్
— ahavideoin (@ahavideoIN) April 1, 2023
‘ఆహా’ ఆ ఊహే ఎంత బాగుందో కదా!!
అందుకే రాబోతుంది ‘ఆహా’ దినపత్రిక 🗞️ మీ ముంగిట్లోకి…#ahaVarthalu pic.twitter.com/0iVeMo4958