జబర్దస్త్ కమెడియన్ Hyper Aadi .. ఈయన గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..బుల్లి తెరపై వరుస షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.. అయితే ఆదికి గతంలో పెళ్లి అయ్యిందనే వార్తలు వినిపించాయి.. అందులో నిజం లేదని తేలింది..ఇప్పుడు ఏకంగా తన భార్యని షోకి తీసుకొచ్చి షాకిచ్చాడు హైపర్ ఆది..ఓ వైపు టీవీ షోస్, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నాడు హైపర్ ఆది. మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోనూ యాక్టీవ్‌గా ఉంటున్నారు. పొలిటికల్ పంచ్‌లతో మరింత పాపులర్ అవుతున్నారు.. ఇప్పుడు ఓ అమ్మాయితో ఆయన పెళ్లి చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. వీరితో దర్శకుడు చంద్ర సిద్ధార్థ్‌తో ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టింది. దీంతో నిజంగానే ఆది పెళ్లి జరిగిందని అనుకున్నారు.

కానీ, అసలు విషయానికొస్తే.. లోతుల్లోకి వెళితే అది నిజం కాదని తేలింది. ఓ సినిమాలో సీన్ అని, ఆయనపై పెళ్లి సీన్ చిత్రీకరించే క్రమంలో తీసిన ఫోటో అని తేలింది. ఆమె టీవీ నటి అని తెలిసింది.ఇప్పుడు మరోసారి షాక్ ఇచ్చాడు..ఏకంగా తన భార్యని షోకి తీసుకొచ్చాడు. నీ భార్య ఏదని యాంకర్ రష్మి హైపర్ ఆదిని నిలదీసింది. దీంతో ఆమె షోలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే హైపర్ ఆది భార్య ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చింది. దీంతో ఆది షాక్ అయ్యాడు. మాస్క్ తియ్యమని కోరగా ఆమె నో చెబుతుంది.. దాంతో స్కిట్ అని అర్థమైంది..

తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలోని సన్నివేశం ఇది. ఈ స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించింది. అనంతరం ఆదికి పంచ్‌లిచ్చాడు బబ్బు తనదైన సాంగ్‌తో అలరించాడు. రష్మి.. అతని రియల్ పేరు అడగ్గా, అవును ఇంతకి ఎవరు నువ్వు అంటూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. మరోవైపు ఆది సైతం పక్కన ఉండి డైలాగ్‌లు కొడుతుండగా, నా మైండ్‌లో ఒకటి ఉంది, అడగనా అంటూ ఇంతకి నువ్వు ఎవరు? అనేశాడు. దీంతో అంతా నవ్వులు పూయించారు. మొత్తానికి షోకు ఆ అమ్మాయి హైలెట్ అయ్యింది.. ఇప్పుడు ఆ ప్రోమో వైరల్ అవుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను ఒకసారి చూడండి..