దర్శక ధీరుడు Rajamouli గురించి మనకి తెలియని విషయం అంటూ ఏది లేదు.సీరియల్ దర్శకుడిగా కెరీర్ ని ప్రారంభించిన రాజమౌళి నేడు ఆస్కార్ అవార్డు గెలిచినా చిత్రానికి దర్శకత్వం వహించే రేంజ్ కి ఎదిగాడు.ఇప్పుడు ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ కూడా కాదు, పాన్ వరల్డ్ డైరెక్టర్ అనే చెప్పాలి.ఆయన చేస్తున్న ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, టాలీవుడ్ ని సరికొత్త మర్కెట్స్ కి పరిచయం చేస్తుంది.
ఇలా రాజమౌళి గురించి ప్రతీ విషయం మనం కళ్లారా చూసాము.కానీ రాజమౌళి గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.వాటి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.రాజమౌళి కి కార్తికేయ అనే కుమారుడు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.రాజమౌళి తీసే ప్రతీ సినిమాకి ఈయనే లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే వాడు.ఇతనికి తెలిసినన్ని ప్రమోషనల్ టెక్నిక్స్ రాజమౌళి కి కూడా తెలియవట.
ఒకవిధంగా #RRR చిత్రానికి నేడు ఆస్కార్ అవార్డు రావడానికి ప్రధాన కారణాలలో ఒకడు కార్తికేయ.ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి దరఖాస్తు చెయ్యడం దగ్గర నుండి, ప్రొమోషన్స్ వరకు అన్నీ కార్తికేయ నే దగ్గరుండి చూసుకున్నాడట. రాజమౌళి కి కుడి భుజం లాగ నిలిచే కార్తికేయ రాజమౌళి కి సొంత కొడుకు కాదట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యిన్నంత పని అయ్యింది. రమా గారిని రాజమౌళి 2001 వ సంవత్సరం లో పెళ్లాడాడు.
అయితే అంతకు ముందే రమా కి ఒక వ్యక్తితో వివాహం అయ్యి విడాకులు కూడా అయిపోయింది అట. మొదటి భర్త తో రమా ‘కార్తికేయ’ అనే బిడ్డకి జన్మనించింది. అలా కార్తికేయని తన సొంత కొడుకుగా స్వీకరించిన రాజమౌళి తన బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాడు. రమా ని పెళ్లాడిన తర్వాత పిల్లల్ని కూడా కనలేదట రాజమౌళి. కార్తికేయ నే ప్రేమగా పెంచుకుంటూ అతిధిని తన కుడి భుజం లాగ మార్చుకున్నాడు రాజమౌళి.