jordar sujatha జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు..రాకేష్ సుజాత జంట ఒకటి అని చెప్పాలి.రాకింగ్ రాకేష్ ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఇందులో కమెడియన్ గా నటిస్తూ అనంతరం టీం లీడర్ గా మారిపోయారు.. చిన్న పిల్లలతో స్కిట్స్ వేస్తూ బాగా ఫెమస్ అయ్యారు.. జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. న్యూస్ ఛానల్లో జోర్దార్ అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు.ఇదే పాపులారిటీతో ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ తర్వాత ఈమెకు జబర్దస్త్ లో అవకాశం రావడంతో రాకింగ్ రాకేష్ టీం లో సందడి చేశారు..ఇటీవల వీరిద్దరూ పెళ్లితో ఒక్కటైయ్యారు.. ఈ జంట గురించి ఓ వార్త సంచలనంగా మారింది..

‘జబర్దస్త్` షోలో చాలా జంటలు తయారయ్యాయి. సుడిగాలి సుధీర్- రష్మి, ఇమ్మాన్యుయెల్-వర్ష, రాకేష్-సుజాత ప్రేమ జంటలుగా చెలామణి అవుతున్నారు. వీరితోపాటు మరికొందరు ఉన్నా, వీరంతటి పేరు, పాపులారిటీ కాలేదు. దీంతో వీరిపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. అయితే రాకేష్-సుజాతలు ప్రేమించుకోవడమే కాదు, ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇటీవలే వీరిద్దరి మ్యారేజ్ జరిగింది. రోజా, ఇతర జబర్దస్త్ యాక్టర్స్ పాల్గొన్నారు. మళ్లీ ఈ జంట జబర్దస్త్ షోలో పాల్గొంటున్నారు. తమదైన స్కిట్లతో అలరిస్తున్నారు..కాగా, ఇప్పుడు తాజాగా తమ ప్రేమ, పెళ్లి వెనకాల అసలు రహస్యాన్ని బయటపెట్టాడు రాకింగ్ రాకేష్. షోలో భాగంగా ఆయన నిజాన్ని బయటపెట్టాడు. అందరిని షాక్‌కి గురి చేశాడు. అయితే రాకేష్ నిజం చెప్పడంతో జోర్దార్ సుజాత నోరెళ్లబెట్టింది.

ఆమెకి ఓ రకంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. మరి రాకేష్ చెప్పిన నిజమేంటి? సుజాత రియాక్షన్ కి కారణమేంటి? అనేది చూస్తే..అనుకోకుండా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైంది..పెళ్లి, ప్రేమ వెనుక నిజాన్ని తాజాగా బయటపెట్టాడు రాకేష్. తనని ప్రేమించమని సుజాత రోజూ టార్చర్ చేసేదట. అసలు నిజాన్ని జబర్దస్త్ వేదికగా బయటపెడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాకేష్. దీంతో అంతా షాక్ అయ్యారు, ఇక పక్కనే ఉన్న సుజాత కి మైండ్ బ్లాంక్ అయ్యింది. నిజం బయటపడటంతో ఆమె నోరెళ్ల పెట్టింది. ఇప్పుడిది రచ్చ రచ్చ అవుతుంది. రాకేష్ చెప్పిన నిజంతో మిగిలిన కమెడియన్లందరు షాక్ అయ్యారు.. ఎక్స్ ట్రా జబర్దస్త్ స్కిట్లో భాగంగా చేసింది కావడం విశేషం. నిజం చెబితే కాయ చెట్టుపైకి వెళ్తుందని, అబద్దం చెబితే కదలదనేది స్కిట్ కాన్సెప్ట్. అందులో భాగంగా మొదట తమది నిజమైన ప్రేమ అని, గాఢమైన ప్రేమ అని రాకేష్ చెప్పగా కాయ కదల్లేదు, కానీ ప్రేమించమని, పెళ్లికోసం టార్చర్ చేసిందని రాకేష్ చెప్పడంతో కాయ పైకి వెళ్లింది.. దీంతో స్టేజ్ పై నవ్వులు పూసాయి.. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతుంది..