సంస్కారం అంటే ఇదీ.. చూసి నేర్చుకో బ‌న్నీ ..! గ‌డ్డిపెట్టిన Chiranjeevi

- Advertisement -

Chiranjeevi మెగా ఫ్యామిలీ లో నేడు ఎంత మంది హీరోలు వచ్చి సక్సెస్ అయినా, ఎంత మంది పాన్ ఇండియన్ స్టార్స్ గా, పాన్ వరల్డ్ స్టార్స్ గా ఎదిగినా వీళ్లంతా వచ్చింది చిరంజీవి తన సొంత కష్టం తో నిర్మించిన సామ్రాజ్యం వల్లే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్యాన్ బేస్ పరంగా ఎవ్వరూ అందుకొని రేంజ్ కి వెళ్ళాడు, కానీ తాను ఎంత ఎత్తుకి ఎదిగినా ఇదంతా చిరంజీవి వల్లే సాధ్యపడింది, ఆయన కష్టం వల్లే మేమంతా ఈరోజు ఇలా ఉన్నాము అని సందర్భం దొరికినప్పుడల్లా అంటూనే ఉంటాడు. రామ్ చరణ్ నేడు గ్లోబల్ స్టార్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.అయ్యినప్పటికీ కూడా అంతర్జాతీయ వేదికలపై తాను నేడు ఈ స్థానం లో ఉన్నాను అంటే అందుకు కారణం మా నాన్న చిరంజీవి, మా బాబాయ్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటాడు.

Chiranjeevi
Chiranjeevi

అల్లు అర్జున్ కూడా మెగాస్టార్ నీడ‌లో ఎదిగామంటూ చెప్పిన సంద‌ర్భాలు ఎన్నో.. అయితే అది గ‌తం.. ఇప్పుడు అల్లు అర్జున్ మారాడు.. అవును నిజమే.. మెగా అనే ప‌దాన్ని దూరం పెట్టాల‌నుకుంటున్నాడు. గ‌త కొన్ని నెల‌లుగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. అప్పట్లో ఇలా ఉండేవాడు కాదు, నీకు మీ నాన్న ఇష్టమా, చిరంజీవి గారు ఇష్టమా అంటే చిరంజీవి గారు అని క్షణం ఆలోచించకుండా సమాధానం చెప్పిన అల్లు అర్జున్, ఇప్పుడు మాత్రం నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అల్లు రామలింగయ్య గారు అన్ని చెప్పుకోవడం మెగా అభిమానులకు తీవ్రమైన అసహనం కి గురి చేసింది.రేసు గుర్రం సినిమా వరకు అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ‘సరైనోడు’ అనే సినిమా వచ్చిందో అప్పటి నుండి పూర్తిగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే చెప్పను బ్రదర్ అని పొగరుగా సమాధానం చెప్పడం అప్పట్లో ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే.

allu

ఇక అప్పటి నుండి అల్లు అర్జున్ చిన్నగా మెగా ఫ్యామిలీ నీడ నుండి తప్పుకుంటూ రావడం మొదలైంది.గత ఏడాది వరకు ఆయన పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ మరియు చిరంజీవి కి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చాడు. నాటు నాటు పాట‌కు ఆస్కార్ వ‌చ్చినందుకు శుభాకాంక్ష‌లు చెబుతూ ఎన్టీఆర్‌కు వీర లెవ‌ల్ ఎలివేష‌న్ ఇచ్చిన అల్లువారి హీరో, రామ్ చ‌ర‌ణ్ గురించి మాత్రం సింపుల్‌గా చెప్పాలి కాబ‌ట్టి చెప్పాడు. మొన్న రామ్ చరణ్ పుట్టిన రోజు కి శుభాకాంక్షలు తెలియజెయ్యలేదు. ఇది మెగా ఫ్యాన్స్‌ని బాగా బాధ పెట్టింది. అయితే నేడు త‌న సినీ జ‌ర్నీ
20 స‌వ‌త్స‌రాలు పూర్తి చేసుకుందంటూ ట్వీట్ చేశాడు. నీకు అన్నీ గుర్తుంటాయ్ కానీ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే గుర్తు లేదా..? అంద‌రు స్టార్స్ విష్ చేస్తుంటే నువ్వెందుకు చెయ్య‌లేదు..? నీ కిరీటం కింద ప‌డుతుందా అంటూ అర్జున్ పై నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -
AA

ఇక చిరంజీవి మాత్రం అల్లు అర్జున్ ఇండస్ట్రీ కి వచ్చి రెండుకి దశాబ్దాలు పూర్తి అయ్యినందున అల్లు అర్జున్ ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాడు. ఇంకా ఎంతో ఎత్తుకు ఎద‌గాలంటూ విష్ చేశాడు. రెండు మూడు హిట్లు కొట్టగానే నీ కళ్ళు నెత్తికి ఎక్కాయి, సంస్కారం అంటే ఇది చూసి నేర్చుకో అంటూ నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. అయితే చిరు సుతి మెత్త‌గా చుర‌క‌లంటించాడంటూ కొంద‌రు.., బాగా గ‌డ్డిపెట్టాడ‌ని కొంద‌రు.. కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మెగా – అల్లు ఫ్యామిలీకి చెడింద‌నేది మాత్రం అర్థ‌మ‌వుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here