Mahesh Babu తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఏవో రెండు మూడు సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి..తెలుగులో ఆయన చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ లుగా నిలుస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు మహేష్ బాబు కూడా ఫ్లాపులతో సతమతమయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడంతో పెద్దగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.. మహేష్ బాబుకు ఇప్పటికి అమ్మాయిల్లో క్రేజ్ తగ్గలేదు.. సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.. ఇకపోతే ఈయన ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడోనని ఫ్యాన్స్ తెగ వెతుకుతున్నారు..

వాస్తావానికి మహేష్ బాబు ఒక్కొక్క సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా. ఒక్కొక్క సినిమాకి మహేష్ బాబు 70 నుంచి 80 కోట్ల వరకు చార్జి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సినిమాల విషయంలో మహేష్ బాబు సగం రెమ్యునరేషన్ తీసుకొని మిగతా సిమ్ సగం రెమ్యూనరేషన్ తన వాటాగా సినిమాలోని పెట్టుబడి పెడతారు… సినిమాలకు జిఎంబి ఎంటర్టైన్మెంట్ సహానిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటుంది.
మరికొన్ని సినిమాలకు మాత్రం మహేష్ బాబు పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని నిర్మాత బాధ్యతలు మాత్రం తీసుకోరు. అలాంటి సినిమాలకు దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు మహేష్ బాబు వసూలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక మహేష్ బాబు కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఆయా బ్రాండ్లకు సంబంధించిన ప్రోడక్ట్లను ప్రమోట్ చేస్తూ కొన్ని యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు..మొత్తంగా ప్రిన్స్ యాడ్ చేసి బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించినందుకు గాను దాదాపు 10 కోట్ల వరకు వసూలు చేస్తున్నారట.
మొత్తం మీద మహేష్ బాబు రెమ్యూనరేషన్ చూసిన చాలామంది షాక్ అవుతూ ఉంటారు ఎందుకంటే మిగతా హీరోల లాగా ఆయన పాన్ ఇండియా హీరోగా ఇంకా పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వలేదు కానీ మహేష్ డిమాండ్ చూసినవారు ఎవరు కూడా ఆయనకు తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమవ్వరు… అలా ఆయన ప్రొమోషన్స్ చేసిన వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది.. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత రాజమౌళి తో సినిమా చేయబోతున్నాడు..