Surekhavani ఆయన మగతనంతో నాకేం సంబంధం.. ముందు ఆ వీడియో చూపించు.. సురేఖ మాటలు వైరల్

- Advertisement -

Surekhavani అక్కగా పిన్నిగా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చూడటానికి హీరోయిన్ మెటీరియల్ అయినా చేసేవన్నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్సే.. ఇటీవల సురేఖ వాణి సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది తాజాగా సురేఖ వాణి తన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను పంచుకోగా అది వైరల్ గా మారింది..

Surekhavani
Surekhavani

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. చూపించు.. ఆ వీడియో చూపించు.. నేను అనలేదు.. అరే నేను అనలేదు.. నాకు ఎందుకు.. ఆయన మగతనంతో నాకేం సంబంధం.. ఎందుకు అనాలే.. నేను ఎందుకు మాట్లాడాలి.. ఆయన ఆయన భార్య చూసుకోవాలి కదా.. నాకేం సంబంధం పండు సురేఖ వాణి తెలంగాణ యాసలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తన రాజకీయ పాదయాత్రలో భాగంగా ఇటీవల ఓ అధికార పార్టీ నాయకుడి పై విమర్శలు గుప్పించారు. ఆయనకి మగతనం లేదన్నట్లుగా మాట్లాడారు. అది వివాదం కావడంతో ఆమె అలా తాను అనలేదని బుకాయించారు. ఆ సందర్భంగా షర్మిల చెప్పిన మాటలు ఇప్పుడు రీల్స్ కి మెయిన్ కంటెంట్ గా మారాయి.

- Advertisement -

ఇప్పుడు అదే కాంటెంట్ ను తీసుకొని సురేఖవాణి ఓ వీడియోను చేసింది. అచ్చం షర్మిల బాడీ లాంగ్వేజ్ ని అనుకరిస్తూ సురేఖ ఈ రియల్ చేయడంతో పాటు ఆమె కట్టుకున్నట్టే కాటన్ సారీ కట్టుకోవడంతో సురేఖ వాణి మరింత అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో కి లక్షల సంఖ్యలో వ్యూస్ రావడంతో పాటు వేల సంఖ్యలో లైక్స్ కొడుతున్నారు నేటిజన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here